ఆంధ్రప్రదేశ్ తదుపరి ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమితులు కానున్నారు. అధికారికంగా రేపు ఉత్తర్వులు వెలువడవచ్చని సమాచారం. మరోవైపు డిసెంబర్ 1వ తేదీ ఆయన బాథ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో కేఎస్ జవహర్ రెడ్డి నేపధ్యం పరిశీలిద్దాం..
1990 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కేఎస్ జవహర్ రెడ్డి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ స్పెషన్ ఛీఫ్ సెక్రటరీగా, టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.
1996లో నల్గొండ జిల్లా కలెక్టర్‌గా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత 1998లో నీటి పారుదల, వాటర్ రిసోర్సెస్ వైస్ ఛైర్మన్ మరియు ఎండీగా వ్యవహరించారు. 1999లో ప్రాధమిక విద్య ప్రోజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2002లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించారు. 2009 అక్టోబర్ లో ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వహించారు.
1964లో జన్మించిన కేఎస్ జవహర్ రెడ్డి యానిమల్ హస్బెండరీ నుంచి గ్యాడ్యుయేషన్ పూర్తి చేసి ఫీడ్ టెక్నాలజీలో పీజీ చేశారు. వివాదరహితుడిగా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డికి పాలనలో విశేష అనుభవం ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి..ఇప్పుడు వైఎస్ జగన్‌కు సన్నిహితంగా ఉంటారనే పేరుంది.
ప్రస్తుతం ఛీఫ్ సెక్రటరీగా ఉన్న సమీర్ శర్మ నవంబర్ 30న రిటైర్ కానున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే సమీర్ శర్మ పదవీకాలం ముగిసినా..ప్రభుత్వం మరో ఆరునెలలు పొడిగించింది. మరోసారి పొడిగించేందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో రిటైర్మెంట్ అనివార్యమైంది. ఆయన స్థానంలో కడప జిల్లాకు చెందిన కేఎస్ జవహర్ రెడ్డి ఛీఫ్ సెక్రటరీగా నియమితులు కానున్నారు.
Also read: Aarogyasri: ఆరోగ్యశ్రీలో మరో చికిత్స, రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్‌లెస్ చికిత్స
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook