KA Paul: హాట్ హాట్ కామెంట్లతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆయన అనుచరులే గట్టి షాక్ ఇచ్చారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ కేఏ పాల్ వాడుతున్న కార్లను స్వాధీనం చేసుకున్నారు.
కేఏ పాల్ ప్రస్తుతం కాకినాడ పర్యటనలో ఉన్నారు. అతని కాన్వాయ్ లో మూడు వాహనాలు ఉన్నాయి.కేఏ పాల్ తన కార్లను తాను బస చేసిన హోటల్ లో పార్కింగ్ చేయాలని చూశారు. అతని అనుచరుడు రత్నాకర్ వచ్చి హోటల్ లో ఎందుకు తన ప్లేస్ లో పార్క్ చేద్దామని చెప్పారు. దీంతో రత్నాకర్ మాట విన్న కేఏ పాల్ .. తన కాన్వాయ్ లోని కార్లను సీబీఎం కాంపౌడ్ లో పార్క్ చేశారు. కార్లు పార్క్ చేసిన కాసేపటి సీబీఎం కాంపౌడ్ గేట్లకు తాళం వేసి వెళ్లిపోయాడు రత్నాకర్. తమ కార్లు తీసుకుందామని వెళ్లిన కేఏ పాల్ కారు డ్రైవర్లు గేటుకు లాక్ ఉండటంతో షాకయ్యారు. రత్నాకర్ కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. రత్నాకర్ కావాలనే గేట్లకు తాళం వేసి వెళ్లాడని కేఏ పాల్ మనుషులు గ్రహించారు. సీబీఎం కాంపౌడ్ నుంచి కార్లు తీసుకెళ్లేందుకు కేఏ పాల్ అనుచరులు ప్రయత్నించినా కాలేజ్ సిబ్బంది ఒప్పుకోలేదు. రత్నాకర్ చెబితేనే తాళాలు ఓపెన్ చేస్తామని చెప్పారు. దీంతో పాల్ మనుషులు, బౌన్సర్లు సీబీఎం కాలేజీ సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు.
కేఏ పాల్ కు తాను భారీగా డబ్బు అప్పుగా ఇచ్చానని.. కానీ ఇప్పటి వరకు ఆ అప్పు తీర్చలేదని రత్నాకర్ చెబుతున్నారు. తీసుకున్న అప్పు తీర్చమని అడిగితే బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ డబ్బులు పాల్ నుంచి వసూలు చేసుకునేందుకే రెండు కార్లను తీసుకెళ్లాలని తెలిపారు. ఈ ఘటన కాకినాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తన దగ్గర వందల కోట్ల డబ్బు ఉందని.. భారీగా ఆస్తులు ఉన్నాయనే చెప్పుకునే కేఏ పాల్ కార్లను అప్పు తీర్చనందుకు అతని అనుచురుడే తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Big Relief To Telangana: బీజేపీతో కేసీఆర్ డీల్ కుదిరిందా? తెలంగాణకు రూ 10,200 కోట్ల రుణానికి ఓకే..
Also Read : Covid 19 Vaccination: షాకింగ్... ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సినేషన్...
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook