/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

KA PAUL PRESS MEET  : రాహుల్ వరంగల్ సభపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ సభకు 87కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని.. అదంతా ప్రజల డబ్బని.. కాంగ్రెస్ పార్టీ ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. రాహుల్ సభ కాంగ్రెస్ పార్టీ  మీటింగ్‌లా లేదని... ఎదో కొత్త పార్టీ సభ పెట్టినట్లు కనపడిందని పాల్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కుటుంబం అంత పెద్ద పెద్ద పదవులు చేశారు కానీ.. ఎప్పుడయినా రైతులకు ఏమైనా చేసారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దేశద్రోహి అంటూ విమర్శలు చేశారు పాల్. రైతులకు 2లక్షల రుణ మాఫీ చేస్తామనేది మాయమాటలు తప్ప మరోటి కాదన్నారు పాల్. తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కోసమే రాహుల్ గాంధీ అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారన్నారు.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టే కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించారని పాల్ వ్యాఖ్యానించారు. పీస్ మిషన్ మూసేయించి పేద ప్రజల కడుపు కొట్టింది కాంగ్రెస్ పార్టీయే అని పాల్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకులంతా తన చారిటీ సిటీకి వచ్చి తన ఆశీస్సులు తీసుకున్న వాళ్లేనని పాల్ అన్నారు. పీస్ మిషన్ ఆపేస్తే కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోతుందని కాంగ్రెస్ నాయకులు సోనియాకు చెప్తే వినలేదని పాల్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు తనతో కలిసి పని చేయడానికి ఇప్పటికీ అడుగుతున్నారని పాల్ పేర్కొన్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ వద్దు అంటూ దేశం అంతా అంటున్నారని పాల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేత VH, సీనియర్ నేత DS తనతో టచ్‌లో ఉన్నారని పాల్ చెప్పారు.

తెరాస చేసిన అవినీతి గురుంచి రాయాలంటే పుస్తకం రాసినా సరిపోదన్నారు పాల్.  తెలంగాణ వచ్చిన తరవాత తెలంగాణ తల్లులు కంట తడి పెడుతున్నారన్న పాల్.. యావత్ తెలంగాణ ప్రజలు ప్రజా శాంతి పార్టీ పాలన కావాలని కోరుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామం నుంచి గ్రూపులు గ్రూపులు తయారై పార్టీలోకి రావాలని అందరూ ప్రయత్నాలు చేస్తున్నారని పాల్ పేర్కొన్నారు. ఒక్క తెలుగు రాష్టాల్లోనే కాకుండా యావత్ ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా ప్రజాశాంతి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కేఏ పాల్ అన్నారు.

కేఏ పాల్ చస్తే అలాంటి పాల్‌లు నలుగురు పుడతారు. ఖబర్ధార్ కేసీఆర్, కేటీఆర్.. నాతో పెట్టుకుంటే ఇబ్బంది పడుతారని పాల్ హెచ్చరించారు. రాహుల్ గాంధీ చాలా సార్లు తనను కలవడానికి చాలా సార్లు ప్రయత్నం చేస్తే రిజెక్ట్ చేశానని పాల్ చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ తన చారిటీని క్లోజ్ చేసి పేదల పొట్ట కొట్టారని.. దేశాన్ని సోనియా గాంధీ ఎప్పుడో సర్వనాశనం చేశారని విమర్శించారు. దేశంలో న్యాయ స్థానాలు బ్రతికే ఉన్నాయని.. తప్పక న్యాయం జరిగి.. తన పీస్ మిషన్ మళ్ళీ మొదలై పేద ప్రజలకు అండగా నిలుస్తుందని పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కేసీఆర్, జగన్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు పాల్. దమ్ముంటే ఒక్క సంతకం పెట్టండి.. 6 నెలలలో లక్షల కోట్లు తెచ్చి రాష్ట్రాలను అప్పుల నుంచి విముక్తి చేస్తానని సవాల్ చేశారు. తను చెప్పింది చేయకుంటే తనను అరెస్ట్ చేసుకోవచ్చని.. సపోర్ట్ సీజ్ చేయొచ్చని ఇది ఓపెన్ ఛాలెంజ్ అంటూ పాల్ సవాల్ చేశారు. తెలంగాణ ప్రజలు ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజా శాంతి పార్టీ వైపు నిలవాలని వేడుకున్నారు పాల్.

Also Read - Pawan Kalyan on alliances in 2024 : పొత్తులపై పవన్ కల్యాణ్ ఏం అన్నారంటే..

Also Read - Chandrababu Ready To Allaince: పొత్తులకు సిద్ధమన్న చంద్రబాబు.. జనసేన, బీజేపీకి స్నేహ హస్తం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
KA PAUL CHALLENGES TELANGANA CM KCR AND AP CM JAGAN
News Source: 
Home Title: 

KA PAUL PRESS MEET  : కేసీఆర్, జగన్‌లకు పాల్ సవాల్

KA PAUL PRESS MEET  : కేసీఆర్, జగన్‌లకు పాల్ సవాల్
Caption: 
KA PAUL CHALLENGES CM KCR AND CM JAGAN (ZEE TELUGU NEWS)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలపై కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఏపీ సీఎం జగన్‌కు సవాల్

ఒక్క సంతకం పెడితే రెండు రాష్ట్రాల అప్పులు తీరుస్తానని సవాల్

Mobile Title: 
KA PAUL PRESS MEET : కేసీఆర్, జగన్‌లకు పాల్ సవాల్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, May 8, 2022 - 19:20
Request Count: 
82
Is Breaking News: 
No