Pawan Kalyan: జగన్‌ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.. జెండా సభలో గర్జించిన జనసేనాని

Pawan Kalyan Speech At Jenda Sabha: జనసేన-టీడీపీ జెండా సభలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారు. సీఎం జగన్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను పాతళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని.. తన పార్టీ జనసేన కాదన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Feb 28, 2024, 08:55 PM IST
Pawan Kalyan: జగన్‌ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.. జెండా సభలో గర్జించిన జనసేనాని

Pawan Kalyan Speech At Jenda Sabha: సిద్ధం అంటున్న వైఎస్ జగన్‌కు యుద్ధం ఇద్దామని టీడీపీ-జనసేన కార్యకర్తలకు జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వచ్చే 45 రోజులు జాగ్రత్తగా ఉండాలని.. వైసీపీ గూండాయిజానికి టీడీపీ, జనసేన కార్యకర్తలు భయపడవద్దన్నారు. వైసీపీ క్రిమినల్స్, గూండాలకు హెచ్చరిక జారీ చేస్తున్నామని... తమన సభలపై గానీ, నాయకులు, కార్యకర్తలపైన గానీ, సామాన్యులపైన గానీ దాడిచేస్తే, భయపెడితే, బెదిరిస్తే మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతామని హెచ్చరించారు. తాడేపల్లి గూడెంలో టీడీపీ-జనసేన తెలుగు జన విజయకేతనం జెండా సభలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్‌తో కూటమి నేతల్లో జోష్ నింపారు. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

"సీఎం జగన్ యువతరానికి ఏ సంపద విడిచిపెట్టారు..? గాయాలు, వేదనలు తప్ప. ఈ ఐదేళ్ల పాలనలో యువత, రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగాలు, అంగన్ వాడీ కార్యకర్తలను సీఎం జగన్ మోసం చేశారు. అందరినీ మోసం చేసిన జగన్‌కు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. నేను ఒక్కడినే అంటూ జగన్ ఊదరగొడుతున్నారు. ఒక్క ఎమ్మెల్యేని లాక్కెళ్లిన నువ్వా ఒక్కడివి..? నా వ్యక్తిగత జీవితంపై చేస్తున్నారు. జగన్ జూబ్లీహిల్స్ ఫామ్ హౌస్‌లో ఏం చేసేవాడో నాకు తెలుసు. నీ వ్యక్తిగత జీవితం గురించి నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్ ఉంది జగన్. మాట్లాడితే నాకు 4 పెళ్ళిళ్ళు అంటాడు.. 4వ పెళ్ళాం నువ్వేనా జగన్.. ఒకవేళ నువ్వే 4వ పెళ్ళాం అయితే రా జగన్.

పర్వతం వంగి సలాం చేయదు. గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది. మన పార్టీ జెండాలు పోరాటానికి స్ఫూర్తి. బూతుల్లో వైసీపీ రౌడీలు, గూండాలు బూత్ క్యాప్చర్ చేస్తే.. దాన్ని ఎదుర్కోవాలనే ఈ సభకు జెండా పేరు పెట్టాం.. సొంత బాబాయ్‌ను చంపించి గుండె పోటు అని చెప్పినా.. వేల కోట్లు దోచేసినా.. దళిత డ్రైవర్‌ను చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినా సరే ఎవరూ ప్రశ్నించరు. కానీ ఏ తప్పూ చేయని నన్ను ప్రశ్నిస్తారు. వాళ్లకు 24 పవర్ తెలియడం లేదు. బలిచక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారు. నెత్తిమీద తొక్కుతుంటే తెలిసింది ఆయన బలం ఎంతో అని. వైసీపీకి వామన అవతారం చూపిస్తాం. పాతాళానికి తొక్కుతాం. జగన్ నిన్ను అథః పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు గుర్తుపెట్టుకో జగన్.

రేపు ఎన్నికలు ముగిశాక వైసీపీకి మన బలం ఏంటో తెలుస్తోంది. జనసేన శ్రేణులు కూడా వ్యూహం నాకు వదలండి. నేను యుద్ధం చేస్తుంది మామూలు వ్యక్తితో కాదు.. సొంత బాబాయ్‌ను చంపించిన జగన్ అనే వ్యక్తితో. సొంత చెల్లిని గోడకేసి గుద్దిన వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. జగన్ ఎలాంటి వాడో మీకు తెలియదు, నాకు తెలుసు దయచేసి నాకు సలహాలు ఇచ్చేవారు అర్దం చేసుకోవాలి. మన దగ్గర డబ్బులు లేవు, వేల కోట్లు లేవు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి డబ్బు కావాలి, కానీ మన దగ్గర ఉన్నాయా, అందుకే 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి సిద్ధపడ్డాను. నా తపన మీరు బాగుండాలని, యువత బాగుండాలని, అలాగే సినిమాలో కూడా నేను అందరి హీరోల సినిమాలు హిట్ అవ్వాలని కోరుకునే వాడిని. 

నేను మీ కోసం నిలబడితే రెండు చోట్ల ఓడించారు. నైరాశ్యం వచ్చింది అయినా నిలబడ్డాను. గాంధీజీని సౌత్ ఆఫ్రికాలో ట్రైన్ నుంచి తోసేస్తే ఆయన ఇక్కడ ఉద్యమాన్ని నడిపి జాతిపిత అయ్యారు. ఆయన నాకు స్ఫూర్తి. యువ ముఖ్యమంత్రి అని అంటున్నారు. యువతను బొంద పెట్టడానికి తప్ప ఈ యువ ముఖ్యమంత్రి ఎందుకు పనికిరాలేదు. చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి అవసరం, ఆయన పారిశ్రామికవేత్తలను తీసుకురాగలడు, నవ నగర నిర్మాణం చేయగలడు అనే నమ్మకం ఉంది. అందుకే పొత్తు పెట్టుకున్నాను. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడక పోతే, నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ నిలబడరు అని నేను నమ్ముతాను, అందుకే పొత్తు పెట్టుకున్నాను. అభివృద్ది వికేంద్రీకరణ ఉండాలి కానీ, రాజధాని వికేంద్రీకరణ కాదు. రాజధానిని ముక్కలు చేయాలనే ఈ మూడు ముక్కల ఆలోచన ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని తాడేపల్లిగూడెం నుంచి చెబుతున్నాను. టీడీపీ-జనసేన కూటమిని గెలిపించండి.." అని పవన్ కళ్యాణ్‌ కోరారు.

Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..

Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News