Pawan Kalyan: మొన్న జూనియర్, ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే యత్నాల్లో జనసేనాని

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంది. నరసాపురం సభలో పవన్ కళ్యాణ్..వ్యూహాత్మకంగా ప్రభాస్ అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 26, 2023, 09:13 PM IST
Pawan Kalyan: మొన్న జూనియర్, ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే యత్నాల్లో జనసేనాని

Pawan Kalyan: వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా మైలేజ్ పొందేందుకు చూస్తున్నారు. యాత్రలో కొత్తగా వివిధ హీరోల అభిమానుల్ని ఆకట్టుకునేందుకు ఆ నటుల గురించి ప్రస్తావించడం ప్రారంభించారు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు ప్రభాస్ గుర్తొచ్చాడు పవన్ కళ్యాణ్‌కు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాు దాటుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ప్రభాస్ సొంత ఊరు మొగల్తూరుకు ఆనుకుని ఉన్న నరసాపురంలో ఏర్పాటైన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ సభలో పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు వచ్చిన ప్రభాస్ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. జనసేనకు మద్దతివ్వాల్సిందిగా ప్రభాస్ అభిమానుల్ని కోరారు. ఇదే వారాహి సభలో ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ ఆయన అభిమానుల్ని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. 

జనసేనకు మద్దతు తెలిపిన ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలంటూ ప్రసంగం ప్రారంభించారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ప్రభాస్ నిజాయితీగా సంపాదిస్తే..వైఎస్ జగన్ అవినీతితో సంపాదించాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేసినా, బాహుబలి చేసినా రోజుకు 500 నుంచి 1000 మందికి ఉపాధి కల్పిస్తారని..ట్యాక్స్ చెల్లిస్తారని, వైఎస్ జగన్ మాత్రం నిజాయితీగా సంపాదించడంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రభాస్‌తో ముడిపెడుతూ వైఎస్ జగన్‌పై చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.

జగన్‌పై ఆరోపణల సంగతేమో గానీ, ప్రభాస్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పడంతో ఇక ఆ అభిమానుల ఆనందానికి తిరుగులేకుండా పోయింది. తమ అభిమాన నటుడి గురించి పవన్ కళ్యాణ్ గొప్పగా మాట్లాడటంతో పవన్ సభలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేశారు.

Also read: YSR Law Nestham Scheme: గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్‌లో రూ.25 వేలు జమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News