Pawan Kalyan Helicopter: పవన్‌ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదా

Pawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 22, 2024, 07:33 PM IST
Pawan Kalyan Helicopter: పవన్‌ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదా

Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు తరచూ అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో పలుమార్లు పర్యటన వాయిదా కాగా.. తాజాగా హెలికాప్టర్‌ రూపంలో అతడి పర్యటనకు అవాంతరం ఎదురైంది. అతడు ప్రయాణించే హెలికాప్టర్ మొరాయించడంతో ఏపీలో జరగాల్సిన రెండు బహిరంగ సభలు వాయిదా పడ్డాయి. పవన్‌ పర్యటన వాయిదాతో జనసేన శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: YS Sharmila Assets: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆస్తులున్న మహిళ షర్మిల.. ఆమె ఆస్తులెన్నో తెలుసా?

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోజుకు రెండుకు తగ్గకుండా సభలు, సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో సోమవారం తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో జరిగే బహిరంగ సభల్లో పవన్‌ కల్యాణ్‌ పాల్గొనాల్సి ఉంది. కానీ ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతికత సమస్య తలెత్తింది.

Also Read: Chiranjeevi: ఏపీ ఎన్నికలపై మెగాస్టార్‌ చిరంజీవి సంచలన నిర్ణయం.. పవన్‌కల్యాణ్‌కా? జగన్‌కా మద్దతు?

తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో బస చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ సోమవారం రెండు సభల్లో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో బయల్దేరారు. హెలికాప్టర్‌లో కూర్చున్న తరవాత టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో సమస్య వచ్చింది. సాంకేతిక నిపుణులు మరమ్మతు చేసేందుకు ప్రయత్నించగా ఎంతకీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో పవన్‌ కల్యాణ్‌ పర్యటనను విరమించుకున్నారు. పవన్‌ రాకపోవడంతో తాడేపల్లిగూడెం సభతోపాటు ఉంగుటూరు సభలు వాయిదా పడ్డాయి.

హెలికాప్టర్‌ దిగి పిఠాపురంలోని తన నివాసానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. అనూహ్య పరిణామంతో పవన్‌ పర్యటన వాయిదా పడడంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశాయి. కాగా పవన్‌ కల్యాణ్‌ పర్యటన తరచూ వాయిదా పడుతున్నాయి. ఎన్నికల ప్రచారం విసృతంగా చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో పవన్‌ పర్యటనల్లో అవాంతరం ఎదురవుతోంది. కాగా పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్‌ రేపు నామినేషన్‌ వేయనున్నారు. రెండు సభలు వాయిదా పడడంతో నామినేషన్‌ కార్యక్రమంపై పవన్‌ సమీక్ష చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News