Jagananna sampoorna gruha hakku : త్వరలో ప్రారంభంకానున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్లు

 Jagananna sampoorna gruha hakku scheme: రుణ గ్రహీతలు గ్రామీణ ప్రాంతాలకు (rural areas) సంబంధించి రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ల పరిధికి సంబంధించి రూ.20 వేలు చెల్లిస్తే ప్రభుత్వం స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువపత్రం జారీ చేస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2021, 05:55 PM IST
  • ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి వేగంగా సాగుతోన్న అర్హుల గుర్తింపు ప్రక్రియ
  • 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు నిర్మించిన ఇళ్లపై లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు
Jagananna sampoorna gruha hakku : త్వరలో ప్రారంభంకానున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్లు

Jagananna sampoorna gruha hakku scheme will start in Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి అర్హుల గుర్తింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ (andhra pradesh housing board) నుంచి రుణం పొంది, లేదంటే రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లపై లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులు కల్పించనుంది.

దీని కోసం 4 దశల్లో అర్హుల గుర్తింపు ప్రక్రియ సాగుతోంది. వైఎస్సార్‌ జిల్లా (YSR‌ District) మినహా మిగిలిన 12 జిల్లాలకు సంబంధించిన 47,37,499 మంది లబ్ధిదారుల వివరాలను మునిసిపాలిటీలు, పంచాయతీలకు గృహ నిర్మాణ శాఖ బదిలీ చేసింది. ఇక ఆయా లబ్ధిదారుల ఇళ్లకు సిబ్బంది వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేపడతారు.

ప్రస్తుత గృహ అనుభవదారుడు ఎవరు.. స్థలం స్వభావం ఏమిటి.. సరిహద్దులు గుర్తించడం తదితర విచారణలు చేపట్టి అర్హులను గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు 12 జిల్లాల్లో 14,34,037 మందిని అర్హులుగా తేల్చారు. అయితే కడప జిల్లాలో (Kadapa District) ఎన్నికల కోడ్‌తో అర్హుల గుర్తింపు ఇంకా చేపట్టలేదు. బద్వేలు ఉప ఎన్నిక కూడా పూర్తి కావడంతో ఇప్పుడు కడప జిల్లాలో కూడా గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. 

Also Read : Petro-Diesel Price: పెట్రోల్ ధర బారెడు పెంచి.. చిటికెడు తగ్గించారు.. ఇదేం న్యాయం..??

 అయితే రుణ గ్రహీతలు గ్రామీణ ప్రాంతాలకు (rural areas) సంబంధించి రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ల పరిధికి సంబంధించి రూ.20 వేలు చెల్లిస్తే ప్రభుత్వం స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువపత్రం జారీ చేస్తుంది.

అయితే ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తం కంటే వాస్తవ లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు బకాయి ఉన్న రుణం తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. వాస్తవ లబ్ధిదారుడు నుంచి ఇల్లు కొనుగోలు చేసిన వారు.. వారసులు గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు, మునిసిపాలిటీల్లో రూ.30 వేలు, కార్పొరేషన్లలో రూ.40 వేలు చెల్లిస్తే పూర్తి యాజమాన్య హక్కులు దక్కుతాయి. 

ఇక గృహ నిర్మాణ సంస్థ నుంచి (andhra pradesh housing board) ఎలాంటి రుణం తీసుకోకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికి ఏపీ ప్రభుత్వం (Ap Government) ఉచితంగా (free rigistration) యాజమాన్య హక్కులు కల్పిస్తోంది.

Also Read : Modi Diwali Celebrations: సైనికులతో ప్రధాని దీపావళి సంబరాలు, దేశానికి సైన్యమే సురక్షా కవచమన్న మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News