Jagananna Ammavodi Scheme: మనీ ఖాతాల్లో చేరేది ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్

Jagananna Ammavodi Scheme: ఆంధ్రప్రదేశ్‌లో స్థానికల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమకు సంక్షేమ పథకాలు మరో రెండు నెలలు నిలిచిపోనున్నాయా అనే అనుమానాలు లబ్దిదారులలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగనన్న అమ్మ ఒడి పథకం ఆగుతుందేమోనని లబ్దిదారులు భావించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2021, 09:36 AM IST
  • స్థానికల ఎన్నికల షెడ్యూల్‌తో ఏపీలో సంక్షేమ పథకాలపై నీలినీడలు
  • జగనన్న అమ్మ ఒడి పథకం నగదు ఖాతాల్లో వేస్తామని మంత్రి స్పష్టత
  • జనవరి 11న తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్న ఆదిమూలపు సురేష్
Jagananna Ammavodi Scheme: మనీ ఖాతాల్లో చేరేది ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్

Jagananna Ammavodi Scheme: ఆంధ్రప్రదేశ్‌లో స్థానికల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమకు సంక్షేమ పథకాలు మరో రెండు నెలలు నిలిచిపోనున్నాయా అనే అనుమానాలు లబ్దిదారులలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగనన్న అమ్మ ఒడి పథకం ఆగుతుందేమోనని లబ్దిదారులు భావించారు. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. అమ్మ ఒడి పథకం కచ్చితంగా అమలు అవుతుందని, ఖాతాల్లో డబ్బులు పడతాయని స్పష్టం చేశారు.

ఈ పథకం కోసం ఇదివరకే జీవో నెంబర్ 3 విడుదల చేసినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు జారీ చేసిన జీవో కనుక సోమవారం (జనవరి 11న) ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్హులైన విద్యార్థిని, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం (Jaganna Ammavodi Scheme)నగదు జమ చేయనున్నారు. తమ ప్రభుత్వం ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసిందని, ఏ ఆందోళన అక్కర్లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

Also Read: Gold Price Today: భారీగా దిగొచ్చిన బంగారం ధర.. రూ.6వేలు తగ్గిన వెండి ధర

జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 44,08,921 మంది లబ్ది చేకూరనుందని తెలిపారు. మొత్తం రూ.6,612 కోట్ల నగదు ఈ తల్లుల బ్యాంకు ఖాతాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) ఆన్‌లైన్ ద్వారా జమ చేస్తారని చెప్పారు. నెల్లూరులో సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి నిధులు నేరుగా జమ అవుతాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1,76,589 మంది తల్లులు కొత్తగా లబ్ధిపొందనున్నారని మంత్రి సురేష్‌ చెప్పారు.

Also Read: Lowest Interest Rate: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

మరోవైపు ఏపీ ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం తెలిసిందే. ఈ మేరకు జనవరి 23న పంచాయతీ ఎన్నికల నోటిషికేషన్ విడుదల కానుంది. 27న రెండో నోటిఫికేషన్ రానుంది. మూడో దశ ఎన్నికలకు జనవరి 31న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ పేర్కొంది. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీలలో ఏపీలో నాలుగు దశలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: EPFO శుభవార్త.. మీ PF రెట్టింపు చేసుకోండి.. మరెన్నో లాభాలు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News