YS Jagan Mohan Reddy Vs Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు చేతులెత్తి మొక్కుతున్న జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్.. ఇది ఎవ్వరు ఊహించనది..

YS Jagan Mohan Reddy Vs Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు చేతులెత్తి మొక్కుతున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి  అభిమానులు . జగన్ ఫ్యాన్స్ ఏంటి పవర్ స్టార్ ను అభినందించడం ఏమిటి ఆశ్చర్యపోతున్నారా..! వివరాల్లోకి వెళితే..

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 18, 2024, 07:15 AM IST
YS Jagan Mohan Reddy Vs Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు చేతులెత్తి మొక్కుతున్న జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్.. ఇది ఎవ్వరు ఊహించనది..

YS Jagan Mohan Reddy Vs Pawan kalyan: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ను వైయస్ఆర్సీపీ హార్ట్ కోర్ అభిమానులు చేతులెత్తి మొక్కుతున్నారు. అంతేకాదు జగన్ ప్రాణాలు కాపాడిన దేవుడిగా కొలుస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్.. అనుకున్నట్టే.. కేంద్రంలో బీజేపీతో పాటు రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీతో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి మొత్తం 175 సీట్లలో 164 సీట్లు గెలిచి సంచలనం రేపారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ కేవలం 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితమైంది.

ఆ సంగతి పక్కనపెడితే.. ఇక్కడ వైయస్ఆర్సీపీ అభిమానులు ఒక సెంటిమెంట్ ను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వై.యస్.రాజశేఖర్ రెడ్డి.. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్ల పాలన తర్వాత 2009లో తిరిగి అధికారంలోకి రాగలిగారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఒక టర్మ్ మొత్తం పాలించిన తర్వాత రెండోసారి సీఎం అయిన నేతగా వై.యస్.రాజశేఖర్ రెడ్డి రికార్డులుకు ఎక్కారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి పెట్టిన  ప్రజా రాజ్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చిన కారణంగా తెలుగు దేశం పార్టీ దారుణంగా దెబ్బ తింది. అప్పట్లో చిరు పార్టీ ప్రజా రాజ్యం కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. ఆ తర్వాత 2009  సెప్టెంబర్ 2 వైయస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసారు.

ఇపుడు ఆ సెంటిమెంట్ ను గుర్తు చేస్తూ.. రెండోసారి వైయస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. ఆయనకు ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉండేదని కొంత మంది సెంటిమెంట్ గుర్తు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ గెలవకుండా పవన్ కళ్యాణ్ .. ఏర్పాటు చేసిన పొత్తు కారణంగా ఆ పార్టీ ఓడిపోయింది. అలా మా జగనన్న ప్రాణాలు కాపాడిన దేవుడిగా పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియా వేదికగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అంతేకాదు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ కూటమి నేతలు ఇచ్చిన హామిలు నెరవేర్చడం కత్తి మీద సామే అని చెబుతున్నారు. అవన్నీ అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు. ఆదాయం పెంచకుండా.. సంక్షేమ పథకాలు అమలు చేయడం అంత ఈజీ వ్యవహారం కాదంటున్నాయి వైసీపీ వర్గాలు. ప్రజలకు ఇచ్చిన హామిలు నెరవేర్చలేక 2029లో మళ్లీ తమకే ప్రజలు పట్టం కడతారనే ఆశలో వైసీపీ నేతలున్నారు. అప్పటి వరకు తెలుగు దేశం, జనసేనా కలిసి ప్రయాణం చేయడం అనేది డౌటే అంటున్నారు.  ఏది ఏమైనా  రాజశేఖర్ రెడ్డి మరణానికి చిరు ఇండైరెక్ట్ గా కారణం అయితే.. నేడు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకుండా చేసి ఆయన ప్రాణాలు నిలబెట్టిన నేతగా పవన్ కళ్యాణ్ ను చూస్తున్నారు జగన్ అభిమానులు. మరి 2029లో వైసీపీ కోరుకున్నట్టుగా ప్రజలు మళ్లీ ఈ పార్టీ పట్టం కడతారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. 

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News