Anchor Shyamala: యాంకర్ శ్యామలకు కీలక పదవి.. వైయస్ జగన్ కొత్త ప్లాన్..!

Y.S.Jagan Mohan Reddy - Anchor Shyamala: 2024 ఎన్నికల తర్వాత భారీ ఓటమి చూసిన వైఎస్ఆర్సిపి పార్టీ.. ఇప్పుడు ప్రక్షాళన చేసుకుంటోంది. అందులో భాగంగానే పలువురికి కీలక పదవులు అందిస్తూ ఉండగా.. జగన్మోహన్ రెడ్డి యాంకర్ శ్యామల కి కూడా కీలక పదవి కట్టబెట్టారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 14, 2024, 08:33 AM IST
Anchor Shyamala: యాంకర్ శ్యామలకు కీలక పదవి.. వైయస్ జగన్ కొత్త ప్లాన్..!

Jagan Mohan Reddy Appoints Shyamala as State Representative: 2024 ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సిపి తరఫున యాంకర్ శ్యామల పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలామంది ఈమెను ఇండైరెక్టుగా టార్గెట్ చేస్తూ చంపేస్తామని బెదిరించారు కూడా..అయినా  వెనుకడుగు వేయలేదు. జగన్ కోసం తాను పనిచేస్తున్నాను అని, కష్టమొచ్చినా, నష్టం వచ్చినా  జగన్ తోనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. 

అయితే నాడు పడ్డ కష్టమే నేడు ఆమెకు ప్రతిఫలం కలిగించిందని చెప్పవచ్చు. వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ప్రస్తుతం మార్పులు చేర్పులు మొదలుపెట్టారు. అందులో భాగంగానే పార్టీలోని  కొందరికి కీలక బాధ్యతలు ఇస్తున్నారు. అందులో భాగంగానే యాంకర్ శ్యామల కి కూడా జగన్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మాజీ మంత్రి రోజా కి కూడా పార్టీలో పదవి దక్కింది. తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 

వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈమెతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి,  జూపూడి ప్రభాకర్ రావు,  ఆర్కే రోజాలకి కూడా ఈ పదవి అందించినట్లు సమాచారం. 
ఇంకొక వైపు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు తెరపైకి రాగా, ఆయన వైపు కొందరు నేతలు మొగ్గు చూపకపోవడంతో వచ్చే.. వారం నెల్లూరు జిల్లాలోని నేతలందరితో కూడా సమావేశం అయ్యి,  జిల్లా అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని సమాచారం. 

ఇక అనంతపురం జిల్లా అనంత వెంకట్రామిరెడ్డి,  శ్రీ సత్యసాయి జిల్లా ఉష శ్రీ చరణ్,  తూర్పుగోదావరి జిల్లా జల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి నగర అధ్యక్షుడుగా మార్గానీ భరత్ రామ్ ను  నియమించినట్లు సమాచారం ఈ మేరకు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మొత్తానికైతే జగన్ తోనే ఉంటానని, జగన్ కోసమే పని చేస్తానని నాడు ఎన్నికలలో ప్రచారం చేసి ఘోరంగా విమర్శలు ఎదుర్కొన్న ఈమెకు.. జగన్ మంచి పదవి కట్ట పెట్టారని చెప్పవచ్చు.

Also Read: AP Floods: 'డబ్బులు ఊరికే రావు' యజమాని ఏపీ వరదలకు భారీ విరాళం

Also Read: Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News