/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

Heat Waves Alert: వేసవి తీవ్రత కారణంగా పగలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వచ్చే మే నెలలో పరిస్థితి మరింత దయనీయం కావచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు భయపెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఏయే రాష్ట్రాల్లో ఎండల తీవ్రత, వడగాల్పులు అధికంగా ఉంటాయో వెల్లడించింది. 

ఈ ఏడాది వేసవి భయపెడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో ఇంకెలా ఉంటుందోననే ఆందోళన నెలకొంది. ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదు కావడం, మరోవైపు తీవ్రమైన వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రానున్న ఐదు రోజుల్లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వేడి గాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లో వాతావరణం వేడిగా ఉంటే కోస్తాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్‌లో వడగాల్పులు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఐఎండీ వెల్లడించింది. కేవలం పగలే కాకుండా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే కనీసం 2 డిగ్రీలు అధికంగా ఉండటంతో నిద్ర కష్టమౌతుందని అంచనా వేస్తున్నారు. 

దేశంలో వచ్చే వారం రోజులు వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ -జూన్ మధ్య కాలంలో 10-20 రోజులు వడగాల్పులు ఉంటాయి. కానీ ఈసారి అంతకంటే ఎక్కువగా 15 రోజులు వడగాల్పులు కొనసాగవచ్చు. ఇక గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.4 డిగ్రీలు అధికంగా ఉంటే వడగాల్పులు ఏర్పడతాయి. ఈ పరిస్థితి రానున్న రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేష్ మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 

రానున్న వారం రోజులు వడగాల్పులు, పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే హెచ్చరికలు రావడంతో వృద్ధులు, రోగులు, పిల్లలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు. వాటర్ కంటెంట్ అధికంగా కలిగిన పుచ్చకాయ, దోసకాయతో పాటు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచాలంటున్నారు. 

Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
IMD Forecasts on weather warns heat waves to be conitnued for coming 5-7 days in south indian states rh
News Source: 
Home Title: 

Heat Waves Alert: రానున్న 5 రోజుల్లో మరింత భగభగమండనున్న రాష్ట్రాలు

Heat Waves Alert: రానున్న 5 రోజుల్లో మరింత భగభగమండనున్న రాష్ట్రాలు
Caption: 
Heat Waves Alert ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Heat Waves Alert: రానున్న 5 రోజుల్లో మరింత భగభగమండనున్న రాష్ట్రాలు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, April 23, 2024 - 20:05
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
16
Is Breaking News: 
No
Word Count: 
274