IAS & IPS officers Transfers in AP: ఆంద్రప్రదేశ్ లో IAS, IPS బదిలీలు.. కొత్త జిల్లాలకు ఎస్పీలు

IAS & IPS Transfers in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు చేపట్టింది. ఐఏఎస్ బదిలీల్లో కొన్ని సవరణలు చేసింది. కొన్ని బదిలీలు కొత్తగా చేపట్టింది. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 12 జిల్లాలకు ఎస్పీలను నియమించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 10, 2023, 07:04 PM IST
IAS & IPS officers Transfers in AP: ఆంద్రప్రదేశ్ లో IAS, IPS బదిలీలు.. కొత్త జిల్లాలకు ఎస్పీలు

IAS & IPS Transfers in Andhra Pradesh: ఎన్నికలకు ఏడాది వ్యవధి ఉందనగా ఏపీ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు మార్పుల చేపట్టింది.  ఐపీఎస్ విభాగంలో  అయితే ఏకంగా 39మందిని బదిలీ చేసింది. ఐఏఎస్ విభాగంలో 8 బదిలీలు జరిగాయి. పూర్తి వివరాలు మీ కోసం..

ఆంధ్ర ప్రదేశ్‌లో ఒకేసారి ఐఏఎస్, ఐపీఎస్ సంచలనంగా మారాయి. పెద్దఎత్తున బదిలీలు చోటుచేసుకోవడంతో ఆసక్తి కలుగుతోంది. ఏపీలో రెండ్రోజుల క్రితం జరిగిన బదిలీల్లో ప్రభుత్వం కొన్ని సవరణలు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. 8 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ బదిలీ ప్రకారం ట్రాన్స్ కో ఎండీ, ఛైర్మన్‌గా విజయానంద్ పూర్తి బాధ్యతలు నిర్వహిస్తారు. అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా బీ శ్రీనివాసరావు వ్యవహరిస్తారు. ఇక పాఠశాక విద్య ప్రత్యేక అధికారిగా వెట్రిసల్వి కొనసాగనున్నారు. కర్నూలు జిల్లా జేసీగా నారపురెడ్డి మౌర్య, నెల్లూరు మున్సిపల్ కమీషనర్‌గా వికాస్ మర్మత్, తిరుపతి మున్సిపల్ కమీషనర్‌గా డి హరిత, బాపట్ల జిల్లా జేసీగా చామకూరి శ్రీధర్, ప్రకాశం జిల్లా జేసీగా కె శ్రీనివాసులు వ్యవహరిస్తారు. 

ఇక ఐపీఎస్‌లలో భారీగా బదిలీలు చోటుచేసుకున్నాయి. దాదాపు 39 మందిపై బదిలీ వేటు పడింది. విశాఖ సిటీ కమీషనర్‌గా త్రివిక్రమ్ వర్మ, పార్వతీపుపరం మన్యం జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్,  విశాఖ సిటీ లా అండ్ ఆర్డర్ డీసీపీగా వాసన విద్యాసాగర్ నాయుడు, అల్లూరి జిల్లా ఎస్పీగా హిన్ సిన్హా, కాకినాడ జిల్లా ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్ ఉంటారు. అనకాపల్లి ఎస్పీగా కేవీ మురళీ కృష్ణ, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, కోనసీమ జిల్లా ఎస్పీగా పి శ్రీధర్, ఏలూరు జిల్లా ఎస్పీగా డి మేరీ ప్రశాంతి నియమితులయ్యారు.

Also Read: Kodali Nani Comments: బాలకృష్ణకి కొడాలి నాని కౌంటర్..వీర తిలకం దిద్ది పంపిన అల్లుళ్లను ఇంటికి పంపినట్టే పంపుతారు!

నెల్లూరు ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఆర్ గంగాధర్ రావు, అనంతపురం జిల్లా ఎస్పీగా కే శ్రీనివాసరావు, సీఐడీ డీఎస్పీగా ఫకీరప్ప, సత్యసాయి జిల్లా ఎస్పిగా ఎస్వీ మాధవరెడ్డి నియమితులయ్యారు. ఇక కర్నూలు ఎస్పీగా జి కృష్ణకాంత్, విజయాడ డీడీసీపగా అజిత వేజెండ్ల నియమితులయ్యారు. 

Also Read: AP Politics: ఏపీ అధికార పార్టీలో ఏం జరుగుతోంది, అసమ్మతి బాటలో ఆదోని ఎమ్మెల్యే ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News