టీడీపి 1000% గెలుస్తుంది.. అందులో 0.1% కూడా సందేహాం లేదు: చంద్రబాబు

టీడీపి 1000%  గెలుస్తుంది.. అందులో 0.1% కూడా సందేహాం లేదు: చంద్రబాబు

Last Updated : May 20, 2019, 03:27 PM IST
టీడీపి 1000%  గెలుస్తుంది.. అందులో 0.1% కూడా సందేహాం లేదు: చంద్రబాబు

అమరావతి: ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం రాష్ట్రంలో 1000% టీడీపినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆ విషయంలో తనకు 0.1% కూడా సందేహాం లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. కొంతమంది వారి మైండ్ గేమ్‌తో రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని.. కానీ అదేమీ కుదరదని మండిపడ్డారు. ఏపీలో టీడీపి గెలుపును ఆపడం ఎవరి తరంకాదని చెబుతూ 110 అసెంబ్లీ స్థానాలతో మన గెలుపు ప్రారంభమవుతుందని, ఇది 120-130వరకూ వెళ్లొచ్చని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 

అంతేకాకుండా ఏపీలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ 18 నుంచి 20 ఎంపీ స్థానాలు గెలుస్తున్నామని ప్రకటించి టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపే ప్రయత్నం చేశారు.

Trending News