AP Govt Officers Tension: రెచ్చిపోయిన అధికారులకు షాక్‌.. సీఎంగా బాధ్యతలు చేపట్టకముందే ఆట మొదలెట్టిన చంద్రబాబు

No Leaves And No Transfers To AP Govt Officers: గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం భయాందోళన చెందుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో తమపై తీవ్ర చర్యలు ఉంటాయేమోననే భయంతో బదిలీలు, సెలవులపై వెళ్తుండగా ప్రభుత్వం అడ్డుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 5, 2024, 11:01 PM IST
AP Govt Officers Tension: రెచ్చిపోయిన అధికారులకు షాక్‌.. సీఎంగా బాధ్యతలు చేపట్టకముందే ఆట మొదలెట్టిన చంద్రబాబు

AP Govt Officers: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికార వర్గాల్లో కలవరం మొదలైంది. బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం, బీజేపీ, జనసేనతో కూడిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో అధికారం మారుతుండడంతో ప్రభుత్వ అధికారులు భయాందోళన చెందుతున్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో కీలక శాఖ అధికారులుగా ఉన్న వారంతా ఏపీని వీడేందుకు, లేదా సెలవుపై వెళ్లేందుకు.. విదేశాలకు వెళ్లేందుకు దరఖాస్తులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున సెలవులు, ట్రాన్స్‌ఫర్లు, డిప్యూటేషన్‌, ఇతర రాష్ట్రాలకు బదిలీ వంటివి విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. అయితే వారి విజ్ఞప్తులను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని.. ఉన్నవారు ఉన్నచోటే ఉండాలని.. సెలవులు, బదిలీలు కుదరవని తేల్చి చెబుతోంది.

Also Read: Chandrababu With NDA: కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు భారీ షాక్‌.. ఇక వారి ఆశలు గల్లంతే

అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులను రిలీవ్‌ చేయలేమని తేల్చి చెప్పింది. ఏ అధికారిని కూడా రిలీవ్‌ చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇక సెలవులు, బదిలీలు కూడా చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు విచ్చలవిడిగా రెచ్చిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు ఆ పార్టీకి తొత్తులుగా పని చేశారని ప్రతిపక్షంగా ఉన్నప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఏపీ సీఐడీ చీప్‌ సంజయ్‌ దీర్ఘకాలిక సెలవుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయంతో ఆయన వెనక్కి తగ్గి సెలవు ప్రతిపాదనను విరమించుకున్నారు.

Also Read: YS Sharmila: నాడు అన్నను గెలిపించిన చెల్లెలు.. నేడు అన్నను ఓడించిన షర్మిల

అధికారులు వీరే..
ఇంకా చాలా మంది సెలవులు, బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సెలవు కోరగా ప్రభుత్వం తిరస్కరించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ రామకృష్ణ, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిలు తమ పూర్వ శాఖకు వెళ్తామని దరఖాస్తు చేసుకున్నారు. గనుల శాఖ ఎండీ వెంకట్‌ రెడ్డితోపాటు ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎండీ మధుసూదన్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్‌ రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు తమను ఏపీ నుంచి విముక్తి చేయాలని విజ్ఞప్తి చేసుకున్నారు. సమాచార శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ రెడ్డి తన బాధ్యతల నుంచి విడుదల చేయాలని దరఖాస్తు పెట్టుకున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ కూడా తెలంగాణకు వెళ్తానని రిలీవ్‌ దరఖాస్తు చేసుకున్నారు.

భయమా?
ప్రభుత్వ అధికారులంతా జగన్‌ పాలనలో ఆయనకు తొత్తులుగా పని చేశారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ కార్యకర్తలుగా అధికారులు పని చేశారనే విమర్శలు వచ్చాయి. జగన్‌ ప్రభుత్వంలో అవినీతి, అరాచకాలకు అధికారులు పాల్పడ్డారని.. వారందరి పేర్లు రెడ్‌ డైరీలో ఉన్నాయని ఎన్నికల ప్రచారంలో టీడీపీ పేర్కొంది. తాము అధికారంలోకి వచ్చాక అందరి భరతం పడతామని హెచ్చరించారు. ఎన్నికల్లో విజయంతో టీడీపీ అధికారంలోకి రాబోతున్నది. అనుకున్నట్టే తమపై భారీ చర్యలు ఉంటాయనే భయంతో ప్రస్తుతం ఆ అధికారులంతా బదిలీలు, సెలవులు వంటి వాటికి దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ వారి గురించి తెలిసిన ప్రభుత్వం యథాస్థానంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News