Pawan Kalyan: ఇప్పటంలో ఇళ్లు కూలిస్తే.. ఇడుపులపాలయలో హైవే వేస్తాం.. పవన్ కళ్యాణ్ వార్నింగ్

Pawan Kalyan Ippatam Village Tour: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2022, 01:17 PM IST
Pawan Kalyan: ఇప్పటంలో ఇళ్లు కూలిస్తే.. ఇడుపులపాలయలో హైవే వేస్తాం.. పవన్ కళ్యాణ్ వార్నింగ్

Pawan Kalyan Ippatam Village Tour: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా ఇప్పటం పర్యటన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఇప్పటం గ్రామంలో ఇళ్లు, గోడలు కూల్చివేతకు నిరసనగా పవన్ అక్కడి వెళ్లారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఆయన బయలుదేరేందుకు సిద్ధమవ్వగా.. ఆయనను అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైవేపై పవన్ కళ్యాణ్ మూడు కి.మీ నడిచి వెళ్లి ఆ తరువాత కారులో ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ సీరియస్ అయ్యారు. 

ఈ సందర్భంగా ఇప్పటం గ్రామానికి చేరుకుని అక్కడి ప్రజలకు మద్దతుగా నిలిచారు. కూల్చిన ఇళ్లు, గోడలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు జనసేనాని. రోడ్డు వెడల్పు అంటూ మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, నెహ్రూ గారి విగ్రహాలు, ఆఖరికి శివుడికి కాపలాగా ఉండే నంది విగ్రహాన్ని కూడా కూల్చేశారంటూ మండిపడ్డారు. వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చకుండా  ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. వైసీపీ గూండాలు ఇలాగే చేస్తే.. ఇడుపుల పాయలో హైవే వేస్తాం చూస్తూ ఉండండి అని హెచ్చరించారు.  

జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లు కూల్చివేశారని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఇక్కడ ఇళ్లు కూల్చారు.. ఈ ప్రభుత్వం కూడా కూలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇంటి ముందు 15 అడుగుల రోడ్డే ఉందన్న జనసేనాని.. అక్కడ ఎందుకు రోడ్డు విస్తరణ చేయట్లేదని ప్రశ్నించారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు చేయడానికి ఇదేమైనా రాజమండ్రినా.. కాకినాడానా అని అడిగారు.

మార్చి 14న జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామ ప్రజలు స్థలం ఇచ్చారు. అమరావతిలో ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించినా ఎక్కడ స్థలం దొరకలేదు. ఇప్పటంవాసులు సభ తమ గ్రామంలో జరుపుకోండని ధైర్యంగా ముందుకు రావడమే నేటి కూల్చివేతలు కారణమని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. జనసేన సభ జరిగిన తరువాత ఏప్రిల్ నెలలో రోడ్డు విస్తరణ అంటూ నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పటికే ఊరిలో 70 అడుగుల వెడల్పులో రోడ్డు ఉంది. దీనిని ఇప్పుడు 120 అడుగుల రోడ్డు విస్తరించి గ్రామానికి అదనపు హంగులు తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది.

Also Read: పవన్ చేతుల మీదుగా ప్రారంభమైన సినిమా నుంచి విశ్వక్ అవుట్..పెద్ద పంచాయితీ అయ్యేట్టుందే

Also Read: MA Question Paper: ఇదేందయ్యా.. ఎంఏ ప్రశ్నాపత్రంలో వైసీపీ గురించి ప్రశ్న.. ఆడుకుంటున్న నెటిజన్లు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News