ముదిరిన బీజేపీ-టీడీపీ గొడవ  ; మాణిక్యాలరావు, బాపిరాజుల  హౌస్ అరెస్ట్

                                                 

Last Updated : Nov 8, 2018, 01:19 PM IST
ముదిరిన బీజేపీ-టీడీపీ గొడవ  ; మాణిక్యాలరావు, బాపిరాజుల  హౌస్ అరెస్ట్

ఏపీలో బీజీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరి సవాళ్లు ప్రతి సవాళ్లకు దారి తీస్తోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ బీజేపీ గొడవ రోడ్డున పడింది. ఆ జిల్లాకు చెందిన బీజేపీ నేత మాణిక్యాలరావు-టీడీపీ నేత బాపిరాజు ఒకరిపై ఒకరు సవాళ్ల విసురుకున్నారు. అభివృద్దిపై బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు.

 అసలేం జరిగింది...?

తాడేపల్లిగూడెంలో అభివద్దిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇరుకున పెట్టేలా మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శలు చేశారు. తాను ప్రాధినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కేంద్ర నిధులతోనే అభివృద్ది చేశానని.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని తీవ్ర విమర్శలు చేశారు.  దీనిపై స్పందించిన బాపిరాజు తాడేపల్లిగూడెంకు ఎవరు ఎంత ఖర్చుపెట్టారో..నియోజకవర్గ  అభివృద్దిపై బహిరంగ చర్చకు రావాలని  బీజేపీ నేత మాణిక్యాలరావుకు సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించిన మాణిక్యాలరావు చర్చకు సై అన్నారు. ఈ క్రమంలో బహిరంగ చర్చకు వెంకటరామన్నగూడెంకు వచ్చేందుకు ఇరు వర్గాలు సిద్ధమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం నెలకొంది.

తాడేపల్లిగూడెంలో టెన్షన్.. టెన్షన్

తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలో వెంకటరామన్నగూడెం చేరుకున్న పోలీసులు బాపిరాజును గృహ నిర్బంధం చేశారు.మరోవైపు మాజీ మంత్రి మాణిక్యాలరావును సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య బహిరంగ చర్చ  వాయిదా పడింది.

Trending News