Babu Swearing Ceremony: బాబు ప్రమాణ స్వీకారానికీ తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వెళుతున్న హీరోలు..

Babu Swearing Ceremony: చంద్రబాబు నాయుడు నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అంతా రెడీ అయింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు అమరావతికి క్యూ కట్టారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 12, 2024, 08:35 AM IST
Babu Swearing Ceremony: బాబు ప్రమాణ స్వీకారానికీ తెలుగు  సినీ ఇండస్ట్రీ నుంచి వెళుతున్న హీరోలు..

Babu Swearing Ceremony: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మరికాసేట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అటు ఉమ్మడి ఏపీ కలిపితే మొత్తంగా నాల్గోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కనీవినీ ఎరగని రీతిలో ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. వర్షం పడిన ప్రజలకు, అతిథులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువరు కేంద్ర మంత్రులు హాజరు అవుతున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, జితన్ రామ్ మాంజి,కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఇతర కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్,  బండి సంజయ్ అమరావతి చేరుకున్నారు.

అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తో పాటు.. సహాయ మంత్రులైన జయంత్ చౌదరి, అనుప్రియా పటేల్, సోషల్ జస్టిస్ మంత్రి రామ్ దాస్ అఠావలే, మాజీ గవర్నర్ తమిళ సైతోపాటు.. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం హాజరు కానున్నారు. అటు సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, కళ్యాణ్  రామ్ వంటి హీరోలతో పాటు రాజమౌళి, కొరటాల శివ, బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు, అశ్వనీదత్ సహా దర్శక, నిర్మాతలు  హాజరు కాబోతున్నారు.

Also read: Chandrababu naidu: వైఎస్ జగన్ కు స్వయంగా ఫోన్ చేసిన చంద్ర బాబు.. అందుబాటులో రాని వైసీపీ అధినేత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News