Chandrababu naidu: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు.. వారి పేర్లు, ఫోన్ నంబర్ లు ఇవే..

Heavy rains in Vijayawada: భారీ వర్షాలకు ఏపీలో వణికిపోయిందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా విజయవాడలో భారీగా వరద నీళ్లు ముంచెత్తాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వరద ప్రాంతాలలో ప్రత్యేకంగా  అధికారుల్ని నియమించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 2, 2024, 12:26 PM IST
  • ఏపీలో వరదల బీభత్సం..
  • కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు..
Chandrababu naidu: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు.. వారి పేర్లు, ఫోన్ నంబర్ లు ఇవే..

Special officers in flood areas Vijayawada: తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచికొడుతున్నాయి. రోడ్లంతా జలమయమైపోయాయి వర్షాలు ప్రజలంతా చిగురుటాకుల్లో వణికిపోతున్నారు. ఏపీలోని విజయవాడ పరిస్థితి మరింత దయానీయంగా ఉంది. అక్కడ బుడమనేరు నది ఉప్పొంగడం వల్ల అనేక కాలనీలు వరదల్లో చిక్కుకుని పోయాయి. వందల మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి బైటపడుతున్నారు. సీఎం చంద్రబాబు.. విజయవాడలోని వరదప్రభావిత ప్రాంతంను బోట్ లో వెళ్లి చూశారు. బాధితులతో మాట్లాడి.. తానున్నానని భరోసా ఇచ్చారు.

 అంతేకాకుండా.. వెంటనే మంత్రులు, అధికారులు విజయవాడ చేరుకుని వరద సహాయక కార్యక్రమాలుదగ్గరుండి చూసుకొవాలని ఆదేశించారు. అంతేకాకుండా.. భద్రత సిబ్బంది వద్దని వారిస్తున్న కూడా చంద్రబాబు.. బోటులో బాధితుల దగ్గరకు వెళ్లి మరీ ధైర్యం చెప్పే ప్రయత్నంచేశారు. అంతేకాకుండా.. వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో అటు కేంద్రంతో కూడా మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయం, బోటులు కావాలని కోరారు.

పీఎం మోదీ, అమిత్ షాతో మాట్లాడి.. ప్రస్తుతం ఏపీ వదరల పరిస్థితుల్ని వివరించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు.. వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఎలాంటి సమస్యలున్న వారికి చెప్పాలని కూడా సీఎం చంద్రబాబు కోరారు.

 

విజయవాడలో.. ప్రాంతాల వారీగా పర్యవేక్షించే అధికారులు వీరే..

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.

అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు...

విజయవాడ సెంట్రల్

1. ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822

2. రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153

3. ఉడా కాలనీ- శ్రీనివాస్ రెడ్డి 9100109124

4. ఆర్ఆర్ పేట- వి. పెద్దిబాబు 9848350481

5. ఆంధ్రప్రభ కాలనీ- అబ్దుల్ రబ్బానీ 9849588941

6. మధ్యకట్ట- టి. కోటేశ్వరరావు 9492274078

7. ఎల్బీఎస్ నగర్- సీహెచ్ శైలజ 9100109180

8. లూనా సెంటర్- పి. శ్రీనివాసరావు 9866776739

9. నందమూరి నగర్- యు. శ్రీనివాసరావు 9849909069

10. అజిత్సింగ్ నగర్- కె. అనురాధ 9154409539

11. సుబ్బరాజునగర్- సీహెచ్ ఆశారాణి 9492555088

12. దేవినగర్ - కే.ప్రియాంక 8500500270

13. పటేల్ నగర్- కె. శ్రీనివాసరావు 7981344125

విజయవాడ పశ్చిమ

14. జోజినగర్- వీకే విజయశ్రీ 9440818026

15. ఊర్మిలా నగర్- శ్రీనివాస్ 8328317067

16. ఓల్డ్ ఆర్ఆర్ పేట- ఎస్ఏ ఆజీజ్ 9394494645

17. పాల ఫ్యాక్టరీ ఏరియా- జె. సునీత 9441871260

విజయవాడ తూర్పు

18. రాజరాజేశ్వరీ నగర్- పి. వెంకటనారాయణ 7901610163

19. మహానాడు రోడ్డు- పి.బాలాజీ కుమార్ 7995086772

20. బ్యాంకు కాలనీ- హేమచంద్ర 9849901148

21. ఏపీఐఐసీ కాలనీ- ఎ. కృష్ణచైతన్య 9398143677

22. కృష్ణలంక - పీఎం సుభాని 7995087045

23. రామలింగేశ్వరనగర్- జి. ఉమాదేవి 8074783959

విజయవాడ రూరల్

24. గొల్లపూడి- ఈ. గోపీచంద్ 9989932852

25. రాయనపాడు- సాకా నాగమణెమ్మ 8331056859

26. జక్కంపూడి - నాగమల్లిక 9966661246

27. పైడూరుపాడు- శ్రీనివాస్యాదవ్ 7416499399

28. కేవీ కండ్రిక- మహేశ్వరరావు 9849902595

29. అంబాపురం- బి. నాగరాజు 8333991210

Read more: Huge crocodiles: వామ్మో.. ఇళ్లలోకి చొరబడుతున్న పెద్ద పెద్ద మొసళ్లు.. ఎక్కడో తెలుసా..?.. వీడియో వైరల్..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News