/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Heavy rains in Tirumala: ఎప్పుడూ పచ్చదనంతో అధ్యాత్మికశోభతో అలరారే తిరుమల(Tirumala)...కుండపోత వర్షాలకు కకావికాలమైంది. తిరుగిరిల్లో వరదలు సృష్టించిన భయోత్పాతానికి..వైకుంఠం నీట మునిగింది. ఆలయ పరిసరాలు, మాడవీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల(Heavy Rains)కు తిరుమలలో పరిస్థితులు దారుణంగా మారాయి. 

Also Read: చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలు..విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం..

ఈ వరద నీరు ధాటికి కనుమ దారుల్లో కొండ చరియలు(Landslides) విరిగిపడుతున్నాయి. కొండ పైనుంచి వస్తున్న నీటితో క‌పిలేశ్వరాల‌యం జలపాతం ఉద్ధృతంగా పడుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం పూర్తిగా నీటితో నిండటంతో..తితిదే(TTD) ఆ మార్గాలను మూసేసింది. వన్యమృగాలు సైతం వరద భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. పాపవినాశనం, జపాలి క్షేత్రాలకు వెళ్లే మార్గాల్లోనూ పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ దారులను సైతం తితిదే (ttd) మూసివేసింది. మొదటి కనుమ రహదారిలో మాత్రమే భక్తుల(Devotees)ను అధికారులు అనుమతిస్తున్నారు.

తిరుమలకు భక్తుల ఎవరు రావద్దని అధికారులు ఆదేశించారు. గురు, శుక్రవారాల్లో దర్శన టిక్కెట్లు ఉన్న భక్తులకు వర్షం తీవ్రత తగ్గిన తర్వాత దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ వరద బీభత్సానికి టూరిజం హోటల్ ప్రహరీగోడ కూలి ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Section: 
English Title: 
Heavy Rains in Tirumala
News Source: 
Home Title: 

శ్రీవారి ఆలయానికి పోటెత్తిన వరద...మెట్ల మార్గాలను మూసేసిన తితిదే...

తిరుమలలో వరద బీభత్సం..జలదిగ్బంధంలో శ్రీవారి ఆలయం..
Caption: 
Heavy Rains in Tirumala
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

తిరుమలలో కనివినీ ఎరుగని జలప్రళయం

విరిగిపడుతున్న కొండ చరియలు

తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు

Mobile Title: 
శ్రీవారి ఆలయానికి పోటెత్తిన వరద...మెట్ల మార్గాలను మూసేసిన తితిదే...
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, November 19, 2021 - 10:53
Request Count: 
101
Is Breaking News: 
No