AP Assembly Elections 2024: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. బీజేపీలోకి జంప్..!

Gudur MLA Varaprasad Rao: గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. జనసేనలోకి చేరతారని ప్రచారం జరగ్గా.. తాజాగా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పురంధేశ్వరితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 12, 2024, 12:46 PM IST
AP Assembly Elections 2024: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. బీజేపీలోకి జంప్..!

Gudur MLA Varaprasad Rao: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌కు (AP Elections Notification) ముందే రాజకీయ పరిణామాలు విచిత్రంగా మారుతున్నాయి. టికెట్ దక్కని నేతలు ఇతర పార్టీల్లో కర్చీఫ్ వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎక్కువ మంది టీడీపీ, జనసేన ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలను కాదని.. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ నాయకుడు ఎవరంటే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు (MLA Varaprasad Rao). ఈసారి మేరుగ మురళీకి గూడూరు టికెట్‌ కేటాయించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు.

Also Read: Gorakhpur Road Accident: ఘోరం.. రోడ్డుపైన నడుస్తున్న వారిని గుద్ది చంపారు.. వైరల్ గా మారిన వీడియో.. 

ఈ క్రమంలోనే జనసేన పార్టీలో చేరేందుకు మొదట సిద్ధమయ్యారు. అయితే ఎందుకో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యక్షకావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో ఆయన సమావేశమయ్యారు. గూడూరు టికెట్ తనకు ఇస్తే.. బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. కార్యకర్తలు, అనుచరులతో కలిసి మాట్లాడిన తరువాత కాషాయ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. 

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై అధికారిక ప్రకటన రావడంతో కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. బీజేపీ-జనసేనకు 30 ఎమ్మెల్యేలు, 8 ఎంపీ స్థానాలను టీడీపీ కేటాయించింది. బీజేపీ అగ్ర నేతలు ఏపీలోనే మకాం వేసి అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి షెకావత్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో చర్చలు జరుపుతున్నారు. అభ్యర్థుల ఎంపిక త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వరప్రసాద్ పురంధేశ్వరితో భేటీ కావడం బిగ్ ట్విస్ట్‌గా మారింది. 

ముందుగా తెలుగుదేశం జనసేన పొత్తు ఖాయమైనప్పుడు జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కేటాంచిన విషయం తెలిసిందే. బీజేపీతో పొత్తు ఖరారైన తరువాత బీజేపీకు 6 లోక్‌సభ, జనసేనకు 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించినట్లు సమాచారం. జనసేనకు కేటాయించిన పార్లమెంట్‌స్థానాల్లో ఒకటి తగ్గిపోయింది. ఇక అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు 24 సీట్లే ఉంటాయా..? లేదా త్యాగం చేస్తుందా అనేది చూడాలి. మరోవైపు మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికతోపాటు మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టిపెట్టనున్నారు.  

Also Read: Mukesh Ambani: ముకేశ్ అంబానీ చదువుకున్న స్కూల్ ఇదే.. అప్పట్లో ఫీజు ఎంత చెల్లించేవారో తెలిస్తే ఫ్యూజులు అవుట్..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News