RTC Reduces Bus Fare: ప్రయాణికులకు శుభవార్త.. ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో ఛార్జీలు తగ్గించిన ఏపీఎస్‌ ఆర్టీసీ

APS RTC has reduced fares: ప్రయాణికులకు ఆ రోజు మినహా అన్ని రోజుల్లో ఛార్జీల్లో రాయితీ ఇస్తోన్న ఆర్టీసీ. మస్త్ బంపర్‌‌ ఆఫర్ ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2022, 08:33 PM IST
  • ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త
  • గుడ్ న్యూస్ చెప్పిన కృష్ణా జిల్లా ఆర్టీసీ అధికారులు
  • ఆదివారం రోజు మినహా అన్ని రోజుల్లో ఛార్జీల తగ్గింపు
RTC Reduces Bus Fare: ప్రయాణికులకు శుభవార్త.. ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో ఛార్జీలు తగ్గించిన ఏపీఎస్‌ ఆర్టీసీ

APSRTC Reduces Bus Fare : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికులకు కృష్ణా జిల్లా ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌ ప్రయాణించే ప్రయాణికులకు ఆదివారం రోజు మినహా అన్ని రోజుల్లో ఛార్జీల తగ్గింపు ఉండనుంది. ఈ మేరకు ఆర్టీసీ (APSRTC) అధికారులు స్పష్టతనిచ్చారు. 

ఏసీ బస్సులు, ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడ్‌ బస్సుల్లో టికెట్ రేటు ఇరవై శాతం తగ్గిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నుంచి కృష్ణా జిల్లాకు వెళ్లే వారికి శుక్రవారం తప్ప మిగతా రోజులో రాయితీ వర్తించనుంది.

ఇక ఇటీవల విజయవాడ, బెంగళూర్‌‌ల మధ్య ప్రయాణించే వారికి కూడా ఆర్టీసీ (RTC) కొత్త ఆఫర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సిటీల మధ్య నడిచే వెన్నెల స్లీపర్‌‌తో పాటు అమరావతి (ఏసీ) బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తాజాగా ఆర్టీసీ ప్రకటించింది. 

ఇక ఈ బస్సులన్నీ కూడా గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతిల మీదుగా వెళ్తాయి. ఆయా స్టేషన్స్‌లలో బస్సులు ఎక్కే ప్రయాణికులందరికీ ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.

Also Read : AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు.. స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు

కాగా విజయవాడ నుంచి బెంగళూర్‌‌ వెళ్లే బస్సుల్లో (Buses) ఆదివారం, బెంగళూర్‌‌ నుంచి విజయవాడ వెళ్లే బస్సుల్లో శుక్రవారం మాత్రమే రాయితీ లేకుండా సాధారణ ఛార్జి వసూలు చేస్తుండగా.. మిగిలిన అన్ని రోజుల్లోనూ ఇరవై శాతం రాయితీ వర్తిస్తుంది.

Also Read : AP PRC Issue: ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కానున్న ఉద్యోగ సంఘాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News