GIS 2023 Menu: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అతిథులకు నోరూరించే వంటకాలు

GIS 2023 Menu: ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. దేశ విదేశాల్నించి వచ్చే అతిరధ మహారధుల కోసం నోరూరించే వంటకాలు సిద్ధమౌతున్నాయి. సమ్మిట్ అతిధులకు ఏపీ రుచిని చూపించనున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2023, 09:42 AM IST
GIS 2023 Menu: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అతిథులకు నోరూరించే వంటకాలు

అడ్వాంటేజ్ ఏపీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 3, 4 తేదీల్లో తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు విశాఖపట్నం సర్వాంగ సుందరంగా తయారైంది. దేశీయ ప్రముఖులతో పాటు 45 దేశాల్నించి తరలివచ్చే అతిధుల ఆతిధ్యం కోసం ఏపీలోని మూడు ప్రాంతాల రుచుల్ని చూపించనుంది ప్రభుత్వం. 

జీఐఎస్ 2023 ఇవాళ, రేపు రెండ్రోజులపాటు జరగనుంది. విశాఖపట్నంలో జరగనున్న ఈ సమ్మిట్ కోసం నోరూరించే ఏపీ వంటల జాబితా సిద్ధమైంది. వెజ్, నాన్‌వెజ్ కేటగరీ మెనూ రూపకల్పన పూర్తయింది. తొలిరోజు కొన్ని రకాలు, రెండవ రోజు కొన్ని రకాలతో మెనూ ఆకట్టుకోనుంది. తొలిరోజు మద్యాహ్నం భోజనంలో..బొమ్మిడాయిల పులుసు, గుంటూరు కోడి వేపుడు, రొయ్యల మసాలా, మటన్ కర్రీ, చికెన్ పలావ్ ఉంటే..వెజ్ రకంలో ఉలవ చారు, మష్రూం, క్యాప్సికం, ఆలూ గార్లిక్ ఫ్రై, క్యాబేజి మటర్ ఫ్రై, వెజ్ పలావ్, రోటీ, కుల్చా, పన్నీర్ బటర్ మసాలా, మెంతికూర-కార్న్ రైస్, మిర్చి సలాడ్, టొమాటో పప్పు, బీట్‌‌రూట్ రసం, మజ్జిగ పులుసు, గోభీ ఆవకాయ, నెయ్యి, వడియాలు, ద్రాక్ష పండ్ల పచ్చడి, చల్ల మిర్చి ఉంటాయి. స్వీట్స్‌లో కట్ ఫ్రూట్స్, ఐస్ క్రీం, పేస్ట్రీ, కాలా జామున్, జున్ను చంద్రకాంతలుంటాయి.

ఇక రెండవ రోజు భోజనంలో రష్యన్ సలాడ్, వెజ్ సలాడ్, రుమాలి రోటి, బటన్ నాన్ ఉంటుంది. నాన్‌వెజ్‌లో ఆంధ్రా చికెన్ కర్రీ, చేప ఫ్రై, గోంగూర, రొయ్యల కూర, ఎగ్ మసాలా, మటన్ పలావ్ ఉంటాయి. వెజ్ రకంలో బిర్యానీ, కరివేపాకు రైస్, కడాయ్ పన్నీర్, క్యారెట్ బీన్స్ కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి ఉంటాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, వడ, టొమాటో బాత్, హాట్ పొంగల్ ఉంటాయి. స్నాక్స్‌లో ఫ్లమ్ కేక్, డ్రై కేక్, వెజ్ బుల్లెట్, మఫిన్స్, స్ప్రింగ్ రోల్స్ ఉంటే ఈవెనింగ్ స్నాక్స్‌లో కుకీస్, చీజ్ బాల్స్, డ్రై ఫ్రూట్ కేక్, కట్ మిర్చి బజ్జీలు ఉంటాయి.

Also read: AP Cabinet Meet: మార్చ్ 14 ఏపీ కేబినెట్ భేటీ..అసలు ఎజెండా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News