Tadepalligudem: పండుగ పూట విషాదం.. తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 11:46 AM IST
  • పండుగ పూట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం
  • తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం
  • రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
Tadepalligudem: పండుగ పూట విషాదం.. తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!

Four people died and 10 seriously injured in Tadepalligudem Road Accident: సంక్రాంతి పండగ (Makar Sankranti) పర్వదినాన ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా తాడేపల్లిగూడెం (Tadepalligudem) దగ్గర చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

విశాఖ జిల్లా దువ్వాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చేపల లోడుతో ఓ లారీ (Fish Lorry) వెళుతోంది. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు జాతీయ రహదారి 216 వద్దకు రాగానే అదుపు తప్పిన లారీ.. ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే బిహార్‌కు చెందిన నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. 

Also Read: India Covid Cases Today: భారత్‌లో కరోనా పంజా.. రెండున్నర లక్షలకు పైగా కొత్త కేసులు!!

ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి (Tadepalligudem Hospital) తరలించారు. మరోవైపు మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి డ్రైవర్‌ నిద్ర మత్తే కారణమని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ వీర అనిమానిస్తున్నారు.

Also Read: Virat Kohli - DRS: కేవలం ప్రత్యర్థి పైనే కాదు.. మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి! మరోసారి డీఆర్‌ఎస్‌ దుమారం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News