Floor Tiles Incident: ఆ పెళ్లిలో ఇంతకు ఏం జరిగిదో తెలుసా.. తెలిస్తే ఒక్క సారిగా ఆశ్చర్యపోతారు..

Function Hall Floor Tiles Incident: విశాఖ జిల్లా చినముషిడివాడలో పెళ్లిలో ఓ వింత ఘటన జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇంతకు ఆ పెళ్లిలో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2023, 11:18 AM IST
Floor Tiles Incident: ఆ పెళ్లిలో ఇంతకు ఏం జరిగిదో తెలుసా.. తెలిస్తే ఒక్క సారిగా ఆశ్చర్యపోతారు..

Function Hall Floor Tiles Incident: ఫంక్షన్‌ హాల్‌లో సరదగా ఓ పెళ్లి జరుగుతోంది. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు. పెళ్లికి వచ్చిన పెద్దలు బంధువులు కూడా భోనాలు చేస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ ఊహించని సంఘటన జరిగింది. ఇంతలోనే పెద్ద అలజడి జరిగిపోయింది. హాల్‌లో ఉన్న వారంతా ఒక్క సారిగా అరుపులు కేకలతో  బయటకు పరుగులు తీశారు. ఇంతకి ఏం జరిగి ఉంటుందని అనుకుంటారు. అసలు విషయం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అవును నిజం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

అలా సరదగా జరుగుతున్న పెళ్లిలో ఒక్కసారిగా హాలులో ఫ్లోరింగ్‌పై టైల్స్‌ ఒక్కసారిగా పగిలిపోయాయి. దీంతో అక్కడ తింటున్నవారంతా భయంతో అక్కడి నుంచి భయటకు పరుగులు తీశారు. ఈ ఘటన విశాఖ జిల్లా చినముషిడివాడలో జరిగింది. అదే పట్టణానికి చెందిన  చిరంజీవి, మౌనికల పెళ్లి వేడుక కోలాహలంగా జరుగుతోంది. ఈ నెల శుక్రవారం 5.15 గంటలకు ముహూర్తం కాగా.. బంధువులు, స్నేహితులు గురువారం రాత్రి 9 గంటలకే ఫంక్షన్‌ హాల్‌లోకి చేరుకున్నారు. కాగా అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఒక్కసారిగా నేలపై ఉన్న టైల్స్‌ పగిలిపోయి. దీంతో అక్కడున్నవారికి ఏం జరిగిందో ఆర్థంకాక ఎక్కడి వారు.. అక్కడ పరుగులు తీశారు.

దీంతో పెళ్లికి వచ్చిన కొందరు పెందుర్తి పోలీసులకు సమాచారాన్ని కూడా అందించారు. అయితే పోలీసు సిబ్బంది హుటహుటిన అక్కడి చేరుకుని పరీక్షించగా.. పెళ్లికి వచ్చిన బంధువులు చెప్పినదే నిజమైంది.  ఫ్లోర్ టైల్స్ పగిలిపోయి ఉండడంతో పోలీసు కూడా ఆశ్చర్యపోయారు. మొత్తం ఆ భవనంలో ఫ్లోర్లు ఉంటే.. మొదటి అంతస్తులో ఇలా జరగడం విశేషం. దీంతో అక్కడున్న ఫంక్షన్‌ హాల్‌ వాళ్లు మరో కళ్యాణ్ మండపాన్ని సిద్ధం చేయించి అప్పగించినట్లు తెలుస్తోంది.

Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 

Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News