Fight Between YSRCP and TDP Cadre at Macherla: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను నెలకొన్నాయి. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఇదేం కర్మ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎత్తి చూపిస్తూ తామ ప్రజల్లోకి వెళతామని ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు, ఆ మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులోనూ, అక్కడి లోకల్ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ వెళుతున్నారు.
మరోపక్క అధికార వైసీపీ కూడా గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఇంచార్జ్లతో కలిసి లోకల్ క్యాడర్ ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాక ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి లబ్ధి చేకూరింది అనే విషయాన్ని వారికి వివరిస్తున్నారు. అయితే తాజాగా మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది.
మాజీ మునిసిపల్ చైర్మన్ తురకా కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో ఈరోజు జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలోనే అదే వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు ఎదురుపడ్డాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారిద్దరికీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న రాళ్లు, కర్రలతో ఇరు వర్గాల వారు దాడులు చేసుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి అని తెలుస్తోంది.
వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల గాలవాలని చెదరగొట్టినట్లు తెలుస్తోంది. ఈ రాళ్ల దాడి సందర్భంగా కొందరికి గాయాలు కావడంతో గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారని ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి మాచర్లలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని పరిస్థితులు అదుపుతప్పుతాయేమో అనే ఉద్దేశంతో జిల్లా కేంద్రం నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించి మాచర్లలోని ఆ వార్డు మొత్తం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది, పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.
Also Read : Shah Rukh Khan: అమితాబ్ కాళ్లపై పడ్డ షారుఖ్.. జయపై ట్రోలింగ్.. అసలు ఏమైందంటే?
Also Read : Varisu - Mahesh babu: మహేష్ బాబు వద్దన్న కధే వారిసు.. రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ లను టచ్ చేస్తూ విజయ్ వద్దకు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook