Ramya Murder Case Verdict: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గుంటూరు రమ్య హత్యకేసు తీర్పుపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన గొప్పదనానికి ఈ తీర్పు ఒక నిదర్శనమన్నారు.
దిశ చట్టం వచ్చిన తరువాత తొలి విజయం. గుంటూరులో బీటెక్ విద్యార్ధిని రమ్య హత్యకేసులో నిందితుడైన శశికృష్ణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును మహిళా సంఘాలు, విద్యార్ధినులు స్వాగతిస్తున్నారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఈ తీర్పుపై స్పందించారు. ఇది దిశ చట్టం ప్రవేశపెట్టిన తరువాత తొలి విజయంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా జగన్ పరిపాలన దక్షతకు ఈ తీర్పు నిదర్శనమన్నారు. అందుకే మహిళలంతా జగన్‌కు జేజేలు పలుకుతుంటే..టీడీపీ మాత్రం ఆడబిడ్డల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తుందన్నారు.
హత్య జరిగిన పది గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకుని..దిశ చట్టం ప్రకారం ఐదు రోజుల్లో ఛార్డిషీటు దాఖలు చేసి విచారణ త్వరగా జరిగేలా దిశ ప్రత్యేక న్యాయవాదులతో వాదనలు విన్పించారని మంత్రి రోజా చెప్పారు. హత్య జరిగిన 9 నెలల్లోనే నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేయడం జగన్ పరిపాలన గొప్పతనమన్నారు. దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదిస్తే..21 రోజుల్లోనే కచ్చితంగా తప్పు చేసిన నిందితుల్ని ఉరితీయవచ్చు. అప్పుడే ఆడపిల్లలకు రక్షణ ఉంటుందన్నారు. దిశ చట్టం విలువ ఇవాళ అందరికీ తెలుస్తుందన్నారు రోజా.
రమ్య ఘటన చాలా దురదృష్టకరమని..శశికృష్ణ లాంటి మృగాల్ని ఏరిపారేయాల్సిన అవసరముందన్నారు రోజా. ఆ కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా పది లక్షల ఆర్ధిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటిస్థలం ఇచ్చారన్నారు. ఇప్పుడా నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేసి రమ్య ఆత్మకు శాంతి కల్గించారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళపై కూడా ఎలాంటి అఘాయిత్యం జరగకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసుల రక్షణ, దిశ యాప్ ఉపయోగించేవారికి ఫిలితాలు వెంటనే వస్తున్నాయన్నారు. ఇప్పుుడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పుతో మహిళలకు ఓ భరోసా వచ్చిందన్నారు. దిశ చట్టం అమల్లో వచ్చేలోగా ఈ విధమైన చారిత్రాత్మక తీర్పు రావడం అభినందనీయమన్నారు మంత్రి రోజా.
ఇక నుంచి ఆడపిల్లను కన్నెత్తి చూడాలంటేనే..భయపడే పరిస్థితి తలెత్తిందన్నారు. అమ్మాయిలపై దాడి చేసేవారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధమైందన్నారు. ఇక నుంచి తప్పు చేయాలంటే భయపడుతుందన్నారు.
Also read: Roja Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవిలతో రోజా భేటీ, కారణమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook