Cyclone Michaung Contrel Room Help Line Numbers: బంగాళాఖాతం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వలన రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ఈదురు గాలులతో పాటు సముద్రపు అలలు ఎగిసి పడే అవకాశముందని జారీ చేసిన హెచ్చరికను.. అనుసరించి తుఫానును ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి సిధ్ధంగా ఉండాలని కలక్టరు డా.ఏ.మల్లిఖార్జున ఆదేశించారు. శనివారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో వెబెక్స్ ద్వారా జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మ తో కలిసి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 4, 5 తేదీలలో మిచాంగ్ తుఫాను కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని కలెక్టర్ తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో అధిక వేగంతో గాలులు వీచే అవకాశముందని, ఈ మేరకు తీర ప్రాంత మండలాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తుఫాను హెచ్చరిక మూలంగా అధికారులెవరికీ సెలవులు ఉండవని.. మత్స్యకారులను సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని కలక్టర్ హెచ్చరించారు. జీవీఎంసీ పరిధిలో గత అనుభవాలు దృష్ట్యా ముంపు ప్రాంతాలు , కొండవాలు ప్రాంతాల ప్రజలను ముందుగా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరుకైన నీటి ప్రవాహ కాలువలను ముందుగా గుర్తించి చెత్తను తొలగించాలని పేర్కొన్నారు. తుఫాను తరువాత వెను వెంటనే ముంపు నీటిని తొలగించుటకు అన్ని ఏర్పాట్లు ముందుగా చేసుకోవాలని అన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం వారు గ్రామాల్లో తాగునీటి సరఫరా చేయాలని ఇందుకు పంపింగ్ స్టేషన్లో డిజిల్ జనరేటర్స్ సిధ్ధంగా ఉంచాలని సంబంధిత ఎస్ఈని ఆదేశించారు. తుఫాను సమయంలో ట్రాన్స్ ఫార్మర్స్ రిపేర్స్ వస్తే అందుకు అనుగుణంగా ఇన్వెంటరీ లెవెల్ ట్రాన్స్ ఫార్మర్స్ సిద్ధం చేయాలన్నారు. అన్ని విభాగాలకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్, జీవీఎంసీలలో తుఫాను కంట్రోల్ రూములు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
==> కలెక్టరేట్ తుఫాన్ కంట్రోలు రూం నెంబర్లు: 0891-2590102, 0891-2590100.
==> జీవీఎంసీ తుఫాన్ కంట్రోలు రూం నెంబర్లు: టోల్ ఫ్రీ నెం.180042500009, కంట్రోల్ రూమ్ నెం.0891-2869106
తిరుపతి జిల్లాకు ముప్పు..
తిరుపతి జిల్లాకు తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు ఐఎండీ నుంచి సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. ఐఎండీ హెచ్చరికల ఆధారంగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మండల స్థాయి గ్రామస్థాయిలో ఉన్న అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ప్రస్తుత సమాచారం మేరకు డిసెంబర్ 5వ తేదీ వరకు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని.. 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ నెల 4,5వ తేదీల్లో పిల్లలు, గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులు, వృద్దులు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read: Michaung Cyclone: తుపాను ప్రభావం తీవ్రమే, అతి భారీ వర్షాల హెచ్చరిక, ప్రభుత్వం అలర్ట్
Also Read: Diabetic Care in Winter: శీతాకాలంలో మధుమేహం వ్యాధిగ్రస్థులకు తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి