Jawad Cyclone Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని ప్రకటనలో తెలిపింది. తుపాను నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తుపాను కారణంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సంబంధింత రాష్ట్రాల్లో అధికారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
జవాద్ తుపానుపై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వాలు..
- భారత వాతావరణ శాఖ (IMD) సమాచారం మేరకు.. జవాద్ తుపాను డిసెంబరు 4 ఉదయం ఉత్తరాంధ్ర – ఒడిశా రాష్ట్రాల్లోని తీరాన్ని తాకే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో గంటకు 100 కిలో మీటర్ల వేగంగా గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
- తుపాను నేపథ్యంలో ఒడిశాలోని తీర ప్రాంతాలైన నాలుగు జిల్లాలతో పాటు కోస్తా ఆంధ్రలోని 7 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా తీర ప్రాంతాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. తుపాను నేపథ్యంలో డిసెంబరు 5 వరకు జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
- తుపాను రాక ముందు ఒడిశా, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ ఫైర్ సర్వీసెస్, డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో సహా 266 రెస్క్యూ టీమ్స్ మోహరించనున్నారు.
- తుపాను నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని ప్రజలందరూ ఇంటికే పరిమితమవ్వాలని అధికారులు ఆదేశించారు.
- పశ్చిమ బంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 3 నుంచి 6 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం తెలిపింది.
- జవాద్ తుపాను నేపథ్యంలో పశ్చిమ బంగాల్‌లో NDRF ఎనిమిది బృందాలను మోహరించారు. కోల్‌కతాలో రెండు బృందాలు, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్, హుగ్లీ, నదియాలో ఒక్కొక్క టీమ్ చొప్పున మోహరించబడ్డాయి.
- జవాద్ తుపాను ఝార్ఖండ్‌లో ఒక మోస్తరు ప్రభావం చూపే అవకాశం ఉంది. తుపాను దృష్ట్యా ఝార్ఖండ్‌కు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని IMD అధికారులు తెలిపారు. డిసెంబరు 3 నుండి 6 వరకు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జవాద్ తుపాను పై సీనియర్ అధికారులతో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తుపాను కదలిక, దాని ప్రభావం గురించి అధికారులు ఆయనకు వివరించారు.
- తుపాను నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ప్రధాని మోదీ ఆదేశించారు. తుపాను తర్వాత విద్యుత్, టెలికమ్యూనికేషన్స్, వైద్యం, తాగునీరు వంటి సేవలను వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు.
- జవాద్ తుపాను నేపథ్యంలో 95 రైళ్ల సర్వీసులను రద్దు చేయాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది.
Also Read: Jawad Cyclone: బంగాళాఖాతంలో రేపు తుపానుగా మారనున్న వాయుగుండం
Also Read: Chaddi gang : అర్ధరాత్రి అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డ చెడ్డీగ్యాంగ్.. భయాందోళనలో విజయవాడవాసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook