Asani Cyclone: ఆగ్నేయ దానికి ఆనుకొని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అతితీవ్ర తుఫాన్ అసని...వేగంగా తీరంవైపు దూసుకొస్తోంది. గంటకు 25 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న తుపాన్... రేపు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం నికోబార్ దీవుల్లోని కార్‌నికోబార్‌కు పశ్చిమవాయువ్యంగా 920 కిలోమీటర్లు, అండమాన్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమ వాయువ్యంగా 770 కి.మీ న, విశాఖ (ఏపీ )కు ఆగ్నేయంగా 500 కి.మీ, పూరీ (ఒడిశా)కు 650 కి.మీ దూరంలో అసని కేంద్రీకృతమైంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది.
తీరాన్ని సమీపించే కొద్దీ అసని తీవ్ర తుఫాన్ .. బలహీనపడి తుపాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. ఈ నెల 10 నాటికి ఉత్తర కోస్తాంధ్ర - ఒడిశా తీరం వైపు కదిలే తుఫాన్.. ఆ తర్వాత దిశ మార్చుకొని ఒడిశా వైపు వెళ్లే అవకాశమున్నట్లు చెబుతోంది. దీని ప్రభావంతో ఇవాళ సాయంత్రం నుంచి రేపటి వరకు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది.
అసని తుఫాన్ తీరాన్ని సమీపిస్తుండటంతో...ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అధికారయంత్రాంగాన్ని అలెర్ట్ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. అసని తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మరుతుందని గురువారం వరకు మత్సకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. వ్యవసాయ పనులు చేసే రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. తుఫాన్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
also read: Pawan Kalyan on alliances in 2024 : పొత్తులపై పవన్ కల్యాణ్ ఏం అన్నారంటే..
also read: Tirumala Temple: శ్రీవారి సన్నిధిలో హనుమాన్ జయంతి ఉత్సవాలు..తేదీలు ఫిక్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.