KVP on Ys jagan: వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు

KVP on Ys jagan: మొన్నటి వరకూ తెలుగుదేశం-జనసేన పార్టీలు..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆరోపణలు ప్రారంభించింది. వైఎస్ ఆత్మగా పరగణించిన సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ సైతం జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2024, 07:09 AM IST
KVP on Ys jagan: వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు

KVP on Ys jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఢిల్లీ చుట్టూ  ప్రదక్షిణాలు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. తొలిసారిగా జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఏపీలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు, జగన్‌పై ఆరోపణలు తీవ్రం చేస్తోంది. ఇప్పటి వరకూ జగన్‌పై నేరుగా ఆరోపణలు చేయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తొలిసారిగా తీవ్ర ఆరోపణలు చేశారు. అటు చంద్రబాబు ఇటు జగన్ ఇద్దరూ ఢిల్లీకు ఎందుకు వెళ్లారని కేవీపీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలపేరుతో సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఏపీలో వైఎస్ జగన్ అవినీతికి ప్రధాని నరేంద్ర మోదీ మద్దతిస్తున్నారని కేవీపీ ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై రాష్ట్రాల్లో మంత్రులు, బడా నేతల్ని అరెస్టు చేస్తున్నకేంద్ర సంస్థలు ఏపీలో జగన్ జోలికి ఎందుకు పోవడం లేదని విమర్శించారు. ఏపీలో మంత్రులు, అధికారులపై చర్చల్ని ప్రధాని మోదీ అంగీకరించరన్నారు. మోదీ మద్దతుతోనే ఏపీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు రణం తీసుకుందని స్పష్టం చేశారు. 

అటు చంద్రబాబు నాయుడు పూటకో పార్టీతో పొత్తు పెట్టుకుంటూ నితీష్ కుమార్ బాటలో నడుస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లు విసరడం, గుంటూరు వెళ్తున్న రాహుల్ కాన్వాయ్‌పై రాళ్లు గుడ్లు, విసిరిన చంద్రబాబు వైఖరిని ఈ సందర్భంగా కేవీపీ గుర్తు చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పొత్తులు పెట్టుకుండాడని కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. అభద్రతాభావం ఉన్న ప్రతిసారీ చంద్రబాబు జాతి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్నారు. 

Also read: AP Politics: హీటెక్కిస్తున్న ఏపీ రాజకీయాలు.. అసలేం జరుగుతోంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News