CM Jagan review on Health: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చండి..వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష..!

CM Jagan review on Health: వైద్యారోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్యారోగ్యశాఖలో నాడు-నేడు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, ఆరోగ్య శ్రీ పథకాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 13, 2022, 06:25 PM IST
  • వైద్యారోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
  • కరోనా పరిస్థితులపై ఆరా
  • ఆరోగ్య శ్రీని పారదర్శకంగా అమలు చేయాలని ఆదేశం
CM Jagan review on Health: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చండి..వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష..!

CM Jagan review on Health: ఏపీలో ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలన్నారు సీఎం వైఎస్ జగన్. ఈపథకం కింద అందుతున్న వివిధ కార్యక్రమాలు, వాటి ఖర్చులపై ఆరా తీశారు. ఆరోగ్య శ్రీ పథకం కింద 2 వేల 446 ప్రొసిజర్లు కవర్ అవుతున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. దీనిపై నిరంతర అధ్యయనం జరగాలన్నారు. ప్రొసిజర్ల సంఖ్య మరింత పెరగాలని ఆదేశించారు. 

నెలకు ఆరోగ్య శ్రీ కింద కనీసంగా రూ.270 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 104,108 కోసం నెలకు సమారు రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఆరోగ్య ఆసరా కింద నెలకు సుమారు రూ.35 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5 వేలు ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. కోవిడ్ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్‌పై కూడా ఆయన ఆరా తీశారు. విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, కొత్త ఆస్పత్రుల నిర్మాణాలు నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కాలేజీలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. 

విలేజ్‌ క్లినిక్స్ స్థాయిలోనే క్యాన్సర్ గుర్తింపుపై దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, పీహెచ్‌సీలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిసెంబర్ కల్లా వీటిని పూర్తి చేయాలని చెప్పారు. ఇవన్నీ పూర్తి అయితే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానం సమర్థవంతంగా అమలు జరుగుతుందన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్‌పై సిబ్బందికి శిక్షణ ఇప్పించాలన్నారు.

టాటా మెమోరియల్ ద్వారా రాష్ట్రంలో వైద్య సిబ్బందికి, వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంవోయూ కుదిరిందని ఈసందర్భంగా సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఇందులో స్విమ్స్ ఆస్పత్రికి కూడా భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో మంత్రి విడదల రజనీ, సీఎస్ సమీర్ శర్మ, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జీఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్య శ్రీ సీఈవో వి.వినయ్ చంద్‌తోపాటు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Also read:Southwest Monsoon: పోరు గడ్డలోకి నైరుతి రుతు పవనాలు..మూడురోజులపాటు వర్ష సూచన..!

Also read:Chandrababu letter to Jagan: ఉద్యోగమో రామ చంద్రా..సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖాస్త్రం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News