YS Jagan: ఈసీ గంగిరెడ్డికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నివాళి

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పర్యటిస్తున్నారు. స్థానిక భాకాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ (YS Jagan Mohan Reddy Pays Tribute to EC Gangi Reddy)లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం పాల్గొన్నారు.

Last Updated : Oct 5, 2020, 01:25 PM IST
  • ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పర్యటిస్తున్నారు
  • డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సోమవారం పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్
  • తన సతీమణి వైఎస్ భారతి రెడ్డి తండ్రి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డికి వైఎస్ జగన్ నివాళి
YS Jagan: ఈసీ గంగిరెడ్డికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నివాళి

పులివెందుల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) నేడు పులివెందులలో పర్యటిస్తున్నారు. స్థానిక భాకాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం పాల్గొన్నారు. తన సతీమణి వైఎస్ భారతి రెడ్డి తండ్రి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డికి వైఎస్ జగన్ నివాళి అర్పించారు. గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఏపీ సీఎం నివాళులర్పించారు.

పులివెందుల భాకారాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన సంస్మరణ సభలో కుటుంబసభ్యులతో కలిసి సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈసీ గంగిరెడ్డి బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. 

 

కాగా, గత నెలలో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మామ, డాక్టర్ ఈసీ గంగిరెడ్డిని ఏపీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించడం తెలిసిందే. తన పర్యటనలో మార్పులు చేసుకుని తిరుపతి నేరుగా హైదరాబాద్ వచ్చి ఈసీ గంగిరెడ్డిని పరామర్శించి, ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం నాడు గంగిరెడ్డి కన్నుమూశారు. 

Also Read : SVIMS Hospital: తిరుపతి కోవిడ్ సెంటర్‌లో ప్రమాదం.. గర్భిణీ మృతి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News