Cyclone Michoung: మిచౌంగ్ తుఫానుపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు

CM Jagan Review Meeting On Cyclone Michoung: మిచౌంగ్ తుఫాను ఏపీ వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీలులేదని స్పష్టం చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 4, 2023, 04:48 PM IST
Cyclone Michoung: మిచౌంగ్ తుఫానుపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు

CM Jagan Review Meeting On Cyclone Michoung: మిచౌంగ్ తుఫాను ప్రభావిత 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తుఫాను నేపథ్యంలో చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఇప్పటివరకు సుమారు లక్ష టన్నుల ధాన్యాం సేకరణ చేపట్టామని.. మరో 6.50 లక్షల  టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు అందజేయాలని సీఎం జగన్ సూచించారు. ఖరీఫ్ పంటల కాపాడుకోవడం ముఖ్యమన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీలులేదని స్పష్టం చేశారు.

తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. హుద్‌హుద్‌ లాంటి పెద్ద తుఫానులను కూడా మన రాష్ట్రం చూసింది. అటువంటి తుఫానలును సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మంచి అనుభవం మన అధికారులకు ఉంది. 210 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా.. ఈ తుఫాన్‌ పట్ల అప్రమత్తంగా ఉంటూ.. యంత్రాంగం సీరియస్‌గా ఉండాలి. రేపు మధ్యాహ్నం బాపట్ల  సమీపంలో తుపాన్‌ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. అప్పుడు గంటకు 110 కిమీ వేగంతో  ఈదురు గాలులు వీస్తాయని చెబుతున్నారు. వర్షాలు కూడా కురుస్తాయి. 7వ తేదీ నాటికి పరిస్థితులు కుదుటపడే అవకాశాలున్నాయి. 

దీనికి సంబంధించి జిల్లాల కలెక్టర్లు అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరు చేశాం. అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు చొప్పున నిధులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. తిరుపతికి రూ.2 కోట్లు, మిగిలిన జిల్లాల్లో రూ.కోటి చొప్పున ఇచ్చారు. మిగిలిన జిల్లాలకు కూడా మరోరూ.1 కోటి మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులు నియమించాం. వీరంతా కూడా జిల్లాల్లో యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. ఇవాళ సాయంత్రం నుంచి మీ ఈ జిల్లాల్లో అందుబాటులో ఉంటారు.

ఇవన్నీ చేయడంతో పాటు జిల్లా కలెక్టర్లు అందరూ చాలా ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి. ప్రతి కలెక్టర్, ఎస్పీ దీన్నొక సవాలుగా తీసుకుని పనిచేయాలి. ఎలాంటి ప్రాణనష్టం జరగడానికి వీలులేదు. మనుషులుతో పాటు పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు. ఆ మేరకు తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి అక్కడ వారిని సురక్షతి ప్రాంతాలకు తరలించాలి. 181 సహాయ పునరావాస కేంద్రాలను ఇప్పటికే ఈ 8 జిల్లాల్లో ఏర్పాటు చేశారు. మొత్తంగా 308 సహాయ పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటుకు గుర్తించామని అధికారులు చెప్పారు. ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడ వేగంగా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల వారిని అక్కడికి తరలించాలి. ఇప్పటికే 5 ఎన్డీఆర్‌ఎఫ్, మరో 5 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నారు.

Also Read: Abhiram Daggubati: దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. సురేష్ బాబు ఇంట మొదలైన సంబరాలు

Also Read: Vivo T2 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బొనాంజా సేల్‌..Vivo T2 Pro 5Gపై రూ.22,550 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News