CM Relief Fund: సిఎంఆర్ఎఫ్ కు విరాళాల వెల్లువ.. చంద్రబాబును కలిసిన చెక్కులు అందజేసిన ప్రముఖులు..

CM Relief Fund: గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వరదలు ముంచెత్తాయి. ఎంతో గూడు, నీడ చెదిరి పుట్టకొకరు, చెట్టుకొరకు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ సహా పలువురు స్పందించి తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మేమున్నామంటూ ఎంతో మంది ముందుకొచ్చారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 14, 2024, 09:54 AM IST
CM Relief Fund: సిఎంఆర్ఎఫ్ కు విరాళాల వెల్లువ.. చంద్రబాబును కలిసిన చెక్కులు అందజేసిన ప్రముఖులు..

CM Relief Fund: వరదలతో అతలాకుతలైమన ప్రజలను ఆదుకోవడానికి తెలుగు ప్రజలు ఎపుడు ముందుటారు. మరోసారి ఆ విషయం స్పష్టమైంది. తాజాగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వరదలతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు, కార్పోరేట్ ప్రముఖులు సహా పలువురు బిజినెస్ మేన్స్ రంగంలోకి తమ వంతుగా సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు అందజేస్తున్నారు. వరద బాధితుల సహాయార్థం పర్చూరు నియోజకర్గం గొనసపూడి గ్రామం నుండి వచ్చిన విక్రం నారాయణ గారి కుటుంబం ఆధ్వర్యంలో సిఎంఆర్ ఎఫ్ కు భారీ విరాళం అందజేసారు.

సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుని  కలిసి 1కోటి 55 లక్షల 55 వేల 555 రూపాయలు చెక్ ను  అందించారు.
వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు  విక్రం నారాయణ గారి ఫ్యామిలీని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.  

ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ..  ఈ ఆపత్కాలంలో ప్రభుత్వానికి ప్రజలకు అండగా నిలిచిన విక్రం నారాయణ కుటుంబానికి ప్రభుత్వం తరుపున ప్రత్యేక కృతజ్ఞతులు తెలియజేసారు. ఈ సందర్భంగా విక్రం నారాయణ రావు గారి ఫ్యామిలీ మెంబర్స్  మాట్లాడుతూ మేము ఒకప్పుడు  విజయవాడలోనే  సింగ్ నగర్ లో ఉండేవాళ్లం విజయవాడ ప్రజలతో సింగ్ నగర్ తో మాకున్న ప్రత్యేక అనుబంధంతో విజయవాడ ప్రజలకు మా వంతుగా సహాయం చేయాలని ముందుకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఎలాంటి పరిస్థితులు ఎదురైన మా కుటుంబం ఏపీ ప్రజలకు ఎపుడు తోడు నీడుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం విక్రమ్ నారాయణ గారి కుటుంబం ముంబైలో ఫార్మాస్యూటికల్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఏ అవసరమైన ముందుంటామన్నారు.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News