Gorantla Madhav: వైసీపీ నుంచి గోరంట్ల మాధవ్ సస్పెండ్? ట్విట్టర్ ట్రెండింగ్ లో ఎంపీ న్యూడ్ వీడియో కాల్..

Gorantla Madhav: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఈ ఘటన జాతీయ స్థాయిలోనూ చర్చగా మారింది. పార్లమెంట్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.

Written by - Srisailam | Last Updated : Aug 6, 2022, 10:52 AM IST
  • వైసీపీని షేక్ చేస్తున్న ఎంపీ గోరంట్ల వీడియో
  • వైసీపీ నుంచి గోరంట్ల మాధవ్ సస్పెండ్
  • ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో ఎంపీ వీడియో
Gorantla Madhav: వైసీపీ నుంచి గోరంట్ల మాధవ్ సస్పెండ్? ట్విట్టర్ ట్రెండింగ్ లో ఎంపీ న్యూడ్ వీడియో కాల్..

Gorantla Madhav:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఈ ఘటన జాతీయ స్థాయిలోనూ చర్చగా మారింది. పార్లమెంట్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. గౌరవప్రదమైన ఎంపీ హోదాలో ఉండి మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడిన వీడియో బయటికి రావడంతో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లో పడింది. గోరంట్ల వ్యవహారంతో తమకు తలనొప్పి పెరగడంతో సీఎం జగన్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.

న్యూడ్ వీడియో కాల్ పై స్పందించిన ఎంపీ గోరంట్ల మాధవ్.. తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. తాను జిమ్ లో తీసుకున్న వీడియోను ఇలా మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఫోరేన్సిక్ విచారణకు సిద్ధమన్నారు. ఇక మాధవ్ వీడియోలను అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ సాయంత్రానికి ఆ రిపోర్ట్ రానుంది. అయితే ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వీడియోను పరశీలించిన నిపుణులు... అది ఫేక్ కాదనే తేల్చి చెబుతున్నారు. అది ఒరిజినల్ వీడియోనేనని.. కదులుతున్న వీడియోను మార్ఫింగ్ చేయడం కష్టమని స్పష్టం చేశారు. ఇక వైపీసీ నేతలు కూడా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగా కాదని నిర్ధారించుకున్నారని తెలుస్తోంది. అయితే ఫోరెన్సిక్ నివేదిక వచ్చేవరకు చూసి.. అది రాగానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని తెలుస్తోంది. అంతలోపే ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కూడా ముగుస్తుంది. ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎంపీ గోరంట్ల మాధవ్‌  వీడియో గురువారం ఉదయం బయటకు వచ్చింది. నిమిషాల్లోనే వైరల్ గా మారింది. దీంతో సీఎం జగన్ తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అత్యవసరంగా సమావేశమయ్యారు. గోరంట్ల మాధవ్ వీడియోపై చర్చించారు. మాధవ్ తీరుపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారని.. పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. కాని జగన్ తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన సజ్జల.. వీడియోపై దర్యాప్తు జరుగుతుందని.. నిజమని తేలితే చర్యలు ఉంటాయని చెప్పారు. తర్వాత శుక్రవారం కూడా సస్పెండ్ చేస్తారనే ప్రచారం సాగింది. కాని వైసీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే శనివారం సాయంత్రానికి ఫోరెన్సికి రిపోక్ట్ రానుండటంతో.. ఎంపీ గోరంట్ల మాధవ్ పై సస్పెన్షన్ వేటు ఖాయమని తెలుస్తోంది.

మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. మాధవ్ న్యూడ్ వీడియో కాల్ అంశం ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్ లో ఇండియా టాప్ త్రీలో ఉంది. ఇన్ స్టాలోనూ టాప్ 20లో నిలిచింది. ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వైరల్ గా మారింది.

Read also: Bimbisara: అప్పట్లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన బింబిసార డైరెక్టర్.. ఏ సినిమానో తెలుసా?

Read also: Revanth Reddy: మునుగోడులో రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. టీఆర్ఎస్, బీజేపీ షేక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News