పోలీసులకు సీఎం జగన్ క్లాస్; జనాలకు మరింత చేరువ కావాలని ఆదేశం

రాష్ట్రంలో జనాలకు పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారు  

Last Updated : Jun 25, 2019, 01:45 PM IST
పోలీసులకు సీఎం జగన్ క్లాస్; జనాలకు మరింత చేరువ కావాలని ఆదేశం

అమరావతి: రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్ సాధపడాలంటే  పోలీసు వ్యవస్థ కీలక పాత్ర పోషించాల్సి ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం జగన్ మాట్లాడుతూ పోలీసులు ప్రజాస్వామ్యానికి పరిరక్షకులని..డెమోక్రసీ సిస్టంలో వారిదే కీలక పాత్ర అని జగన్ పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితులను చూస్తే పోలీసుల వద్దకు వస్తే కచ్చితంగా న్యాయం జరగుతుందనే నమ్మకం పోయిందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.పోలీస్ స్టేషన్ వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉందన్నారు. మనం తక్షణమే ఇలాంటి పరిస్థితి మనం బయటపడాల్సి ఉందన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీసుల వద్దకు వస్తే  కచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం మనం కల్పించాల్సి ఉందన్నారు. జనాలకు పోలీసులంటే మనోళ్లే అనే పరిస్థితి రావాలని జగన్ పిలుపునిచ్చారు. ఎవరైన సమస్య తీసుకొస్తే స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. బాధితుడి సమస్య పట్ల సానుకూలంగా స్పందిస్తే 50 శాతం పరిష్కారం దొరికి నట్టేనని .. కేసులో విషయంలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గవద్దు జగన్ సూచించారు.

గతంలో యథేచ్ఛగా ఉల్లంఘనలు జరిగాయని జగన్ పేర్కొన్నారు. ఇసుక, మైనింగ్  మాఫీయాను పోలీసు వ్యవస్థే శాసించేదని... అక్కడి నుంచి తీసుకుంటే ప్రతీ విషయంలో పోలీసుల అతి జోక్యం ఉండేదన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాల్సి ఉందన్న జగన్ ..ప్రజలకు కచ్చితంగా న్యాయం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీలకు సీఎం జగన్ ఆదేశించారు.రానున్న రోజుల్లో ఏపీ పోలీసు వ్యవస్థ దేశంలోనే నెంబర్ స్థాయిలో ఉండాలని..మిగిలిన రాష్ట్రాలకు మనం ఆదర్శంగా ఉండాలని  జగన్ సూచించారు.
 

Trending News