CM Jagan Mohan Reddy: వ్యవసాయ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత వేగం

CM Jagan Review On Power Sector: వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించాఉఉ. బొగ్గు నిల్వల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 04:57 PM IST
CM Jagan Mohan Reddy: వ్యవసాయ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత వేగం

CM Jagan Review On Power Sector: రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్‌ డిమాండ్, రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అధికారులు తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు 240 మిలియన్‌ యూనిట్లు, ఏప్రిల్‌లో  250 మిలియన్‌ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామన్నారు. ఇప్పటికే పవర్‌ ఎక్స్‌ఛేంజ్‌లో ముందస్తుగా విద్యుత్‌ను బుక్‌ చేసుకున్నామన్నారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదని ఆదేశించారు. విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదన్నారు. ఆ మేరకు అధికారులు అన్నిరకాలుగా సిద్ధం కావాలని సూచించారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదన్నారు.

ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామన్నారు అధికారులు. మార్చి నాటికి మరో 2 0వేల కనెక్షన్లకుపైగా మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్లు తెలిపారు.మార్చి నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేస్తున్నామన్నారు.

అలాగే పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 2.18 లక్షలకుపైగా ఇళ్లకు  కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు. ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ.. వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

Also Read: Pee Gate in Karnataka: బస్సులో నిద్రిస్తున్న మహిళపై మూత్రం పోసిన యువకుడు   

Also Read: Minister Gummanur Jayaram: మంత్రి గుమ్మనూరు కుటుంబంలో తీవ్ర విషాదం    

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News