వైఎస్ వర్థంతికి చంద్రబాబు ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తొమ్మిదవ వర్థంతి సందర్భంగా ఓ ట్వీట్ చేశారు.

Last Updated : Sep 2, 2018, 06:44 PM IST
వైఎస్ వర్థంతికి చంద్రబాబు ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తొమ్మిదవ వర్థంతి సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. 'మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాను.' అని ట్వీట్ చేశారు.

అలానే ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆశీర్వదిస్తున్నా' అని ట్వీట్ చేశారు.

అలానే నేడు నందమూరి హరికృష్ణ జయంతిని పురస్కరించుకొని చంద్రబాబు ఆయన్ను గుర్తుచేసుకున్నారు. 'చైతన్య రథసారథి, నా ఆత్మీయుడు నందమూరి హరికృష్ణ ఇక లేరన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేడు తన జయంతి సందర్భంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా.. టిడిపి కార్యకర్తల్లో హరి నింపిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని మాటిస్తున్నాను.' అని అన్నారు.

 

 

 

Trending News