Wife beheads Husband in Renikunta : చిత్తూరు (Chittoor) జిల్లా రేణిగుంటలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ హత్యకు దారితీసింది. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య అతని తల నరికేసింది. అనంతరం అతని తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన రేణిగుంట పట్టణ వాసులను భయభ్రాంతులకు గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే... రేణిగుంటలోని (Renigunta) పోలీస్ లైన్ వీధిలో రవి చందర్ (53), వసుంధర దంపతులు చాలా కాలంగా నివసిస్తున్నారు. వీరికి 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గత ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో గురువారం (జనవరి 20) ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరిగి ఘర్షణ జరిగింది.
భర్త రవి చందర్‌పై తీవ్ర ఆగ్రహావేశానికి గురైన వసుంధర అతన్ని కత్తితో పొడిచి చంపింది. ఆపై అతని తల నరికేసింది. తలను సంచిలో వేసుకుని రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. భర్త తలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వసుంధరను చూసి పోలీసులు షాక్ తిన్నారు.
ఘటనపై స్థానిక మహిళా పోలీస్ ఒకరు మాట్లాడుతూ... మృతుడు రవి చందర్ స్వస్థలం గుంటూరు జిల్లా నరసారావుపేట అని, హత్యపై అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చామని తెలిపారు. గిద్దలూరుకు చెందిన వసుంధరతో రవి చందర్‌కు దాదాపు 21 ఏళ్ల క్రితం పెళ్లి జరిగిందన్నారు. ఏడాది కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని... గురువారం జరిగిన గొడవ హత్యకు (Brutal Murder) దారితీసిందని తెలిపారు. రవిచందర్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Also Read: సమంత బాటలోనే.. మెగా డాటర్! విడాకులు కన్ఫర్మ్.. ప్రూఫ్ ఇదిగో!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook