Chittoor: డిప్యూటీ సీఎం ఇలాకాలో దారుణం.. రూ.10 వేలు అప్పు చెల్లించలేదని కాళ్లు, చేతులు విరిచేసిన వైనం..

Attack on Dalit man in Chittoor: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. రూ.10 వేలు అప్పు చెల్లించనందుకు ఓ దళితుడి కాళ్లు, చేతులు విరిచేశాడు ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 12:55 PM IST
  • డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇలాకాలో దారుణం
  • అప్పు చెల్లించలేదని వృద్దుడి కాళ్లు, చేతులు విరిచేశారు
  • నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని నారా లోకేష్ డిమాండ్
Chittoor: డిప్యూటీ సీఎం ఇలాకాలో దారుణం.. రూ.10 వేలు అప్పు చెల్లించలేదని కాళ్లు, చేతులు విరిచేసిన వైనం..

Attack on Dalit man in Chittoor: చిత్తూరు జిల్లాలో చంద్రన్ అనే దళితుడిపై ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి దాష్టికానికి పాల్పడ్డాడు. రూ.10 వేలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఈశ్వర్ రెడ్డి చంద్రన్ కాళ్లు, చేతులు విరిచేశాడు. దాడిపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించినప్పటికీ కేసు నమోదు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటు టీడీపీ నేతలు సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈశ్వర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెద్దకంటిపల్లికి చెందిన చంద్రన్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. పెద్దకంటిపల్లిలోని ఎస్సీ కాలనీలో నివసిస్తున్న చంద్రన్.. రెండేళ్ల క్రితం కలిజవేడు గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. అందుకు ప్రతీ నెలా వడ్డీ చెల్లిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత మూడు నెలలుగా వడ్డీ చెల్లించలేకపోయాడు. 

ఇదే క్రమంలో సోమవారం (ఫిబ్రవరి 28) చంద్రన్ ఇంటికి వచ్చిన ఈశ్వర్ రెడ్డి.. ఆయన్ను కులం పేరుతో దూషించాడు. ఆపై బలవంతంగా తన వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సమీపంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లి చంద్రన్‌పై కర్రలతో దాడికి పాల్పడ్డాడు. అతని కాళ్లు, చేతులు విరిచేశాడు. తీవ్ర గాయాలైన చంద్రన్‌ను అతని కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై దళిత సంఘాలు, ప్రతిపక్ష టీడీపీ భగ్గుమంటున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ఘటనపై ట్విట్టర్‌లో స్పందించారు. జగన్ భజనలో మునిగితేలే డిప్యూటీ సీఎం దళిత జాతికి ఇంత అన్యాయం జరుగుతుంటే స్పందించరేమని లోకేష్ ప్రశ్నించారు. బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైసీపీ ఆర్డర్‌లో ఉందని తేటతెల్లం చేస్తోందన్నారు. బాధితుడి వీడియోని లోకేష్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. రూ.10 వడ్డీ చొప్పున రూ.10 వేలు అప్పుగా తీసుకున్నామని.. అప్పు చెల్లించనందుకు చంద్రన్‌పై దాడి చేసినట్లు అతని భార్య వెల్లడించారు.

Also Read: Weather forecast: ఈసారి ఎండలు మండిపోవడం ఖాయం- రికార్టు స్థాయిలో ఉష్టోగ్రతలు!

Also read: Jharkhand Boat Accident: జార్ఖండ్‌లో విషాదం...నదిలో పడవ బోల్తా.. 14 మంది మృతి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News