Chiranjeevi: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి: చిరంజీవి

Chiranjeevi: ఏపీలో సినిమా టికెట్ల ధరపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. టికెట్ రేట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 02:52 PM IST
  • ఏపీ సినిమా టికెట్ల ధరపై చిరంజీవి అసంతృప్తి
  • అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగానే టికెట్ రేట్స్ ఉండాలన్న చిరు
  • జగన్ ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి
Chiranjeevi: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి: చిరంజీవి

AP Cinema Tickets Issue: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని అగ్రకథానాయకుడు చిరంజీవి(Chiranjeevi) అన్నారు. అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీలోనూ టికెట్ల ధరలు(AP Cinema Tickets Rates) ఉండాలన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

‘''పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌(online Ticketing bill) ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్‌ రేట్స్ ను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది.

Also Read: ప్రముఖ కొరియోగ్రాఫర్‌కు కరోనా, చికిత్సకు డబ్బుల్లేక...

దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్‌ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది''’ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News