Cec comments on pinnelli arrest in evm damage case: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు బుధవారం నాటకీయ పరిణామాల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు . ఆయన హైకోర్టులో నాలుగు కేసుల విషయంలో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు వాటినికొట్టి పారేసింది. దీంతో కోర్టులో హజరుపర్చి విచారిస్తుండగా..పిన్నెల్లి బాత్రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. పిన్నెల్లి అరెస్ట్ తో ఏపీలో రాజకీయాలు మరోసారి హట్ గా మారాయి.
Read more: Serial bride: నిత్య పెళ్లి కూతురికి హెచ్ఐవీ పాజిటివ్.. లబో దిబో మంటున్న యువకులు.. ఎక్కడో తెలుసా..?
పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేసి మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు. పిన్నెల్లి మీద నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో.. న్యాయమూర్తి రెండుకేసుల్లో ఆయనకు బెయిల్ ఇవ్వగా,మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. పిన్నెల్లికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
పిన్నెల్లి అరెస్టు నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారు ఎంతటివారైన వదిలేదిలేదని హెచ్చరించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది రాజ్యంగం కల్పించిన హక్కుగా అభివర్ణించింది. ప్రజలు, నాయకులు తమ ఓటు హక్కులను ఉపయోగించుకొవాలి కానీ రాజ్యంగ ప్రక్రియకు విఘాతంకల్గిస్తే మాత్రం చట్టంప్రకారం చర్యలు ఉంటాయని తీవ్రంగా స్పందించింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించింది.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి చేసిన పని.. ప్రజాస్వామ్యంలో హేయమైన చర్యగా ఈసీ అభివర్ణించింది.స్వేచ్చాయుత ఎన్నికలలో ఈవీఎంలు కీలకపాత్ర పోషిస్తాయయని, అలాంటి ఈవీఎంలను ధ్వంసం చేయడం, ఎన్నికలను అపహస్యం చేయడమే అంటూ ఈసీ వ్యాఖ్యనించింది. దీన్ని బట్టి భవిష్యత్ లో ఎవరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన కూడా కఠినంగా వ్యవహరిస్తామని ఈసీ స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి