Jobs With Intermediate 2024: ఇంటర్ అర్హతతో ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చు.. పూర్తి వివరాలివే..!!

Jobs With Intermediate 2024: ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఏపీ ఇంటర్మీడియేట్‌ ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఇంటర్ తర్వాత వివిధ కోర్సుల్లో చేరి పై చదువులకు వెళ్తారు. కానీ, ఇంటర్ అర్హతతో కొన్ని ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 12, 2024, 11:08 AM IST
Jobs With Intermediate 2024: ఇంటర్ అర్హతతో ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చు.. పూర్తి వివరాలివే..!!

Jobs With Intermediate 2024: ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఏపీ ఇంటర్మీడియేట్‌ ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఇంటర్ తర్వాత వివిధ కోర్సుల్లో చేరి పై చదువులకు వెళ్తారు. కానీ, ఇంటర్ అర్హతతో కొన్ని ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు రంగంలో ఇంటర్ తర్వాత ఉద్యోగాలు అందుబాటులో ఉండటంతోపాటు కొన్ని ప్రభుత్వరంగ ఉద్యోగాలు కూడా ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఆ జాబ్స్ ఏంటో వివరాలు తెలసుకుందాం. 

ఇంటర్ అర్హతతో కేంద్ర రాష్ట్ర ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదలవ్వడం మనం చూస్తూనే ఉంటాయి. వీటి అధికారిక వెబ్‌సైట్లను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. ఇంటర్‌ అర్హతతో RRB (రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు) SSC (స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్), IBPS (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్) UPSC ( యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ద్వారా ప్రతి ఏడాది రిక్రూట్మెంట్లు జరుగుతాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇంటర్ అర్హతతో రిక్రూట్మెంట్లు జరుగుతాయి.

UPSC..
యూనియన్ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఎన్డీఏ ద్వారా రాత పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్‌లు నిర్వహించి ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులను ప్రతి ఏటా ఎంపిక చేస్తుంది. ఈ జాబ్ కు మగ, ఆడ ఇద్దరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షల్లో పాసైన అభ్యర్థులకు ట్రైనింగ్ నిర్వహించి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ అకాడమీ కోర్సల్లో చేర్చుకుంటుంది. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పోస్టింగ్‌ కూడా నిర్వహిస్తుంది.

ఇదీ చదవండి: ఇంటర్ పాసైనవారికి సరైన విద్య, ఉపాధి మార్గాలు ఏముంటాయి?

SSC Recruitment..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా ప్రతి ఏటా రిక్రూట్మెంట్‌ నిర్వహిస్తోంది. దీనికి కూడా ఇంటర్‌ అర్హతతో దరఖాస్తుల స్వీకరణ చేపడుతోంది. లోయర్ డివిజనల్ క్లర్క్, అసిస్టెంట్‌ సెక్రటేరియట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రిక్రూట్మెంట్‌ నిర్వహిస్తోంది SSc. దీనికి కేవలం ఇంటర్మీడియేట్‌ పాసైతే చాలు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు.

రైల్వే..
ఇంటర్ అర్హతతో రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు కూడా ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఇది కూడా ప్రతి ఏటా అభ్యర్థుల ఎంపికలకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు ద్వారా ఇంటర్ అర్హతతో లోకో పైలట్‌, గ్రూప్ డీ పోస్టులు, అసిస్టెంట్‌ క్లర్క్, హెల్పర్ ట్రాక్ మెయింటైనర్, ట్రైన్ క్లర్క్ పోస్టులకు నియామకాలు చేపడుతుంది. 

కేంద్ర రక్షణశాఖలో కూడా ఇంటర్ అర్హతతో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే బార్డర్ ఫోర్స్, ఇండో టిబెటన్ ఫోలీస్‌ ఫోర్స్, సీఐఎస్‌ఎఫ్ లో కూడా ఉద్యోగాలు పొందవచ్చు. అంతేకాదు కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌ కూడా ఇంటర్‌ పాసైనవారు అర్హులు. 

ఇదీ చదవండి: ఏపీ ఇంటర్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్.. రేపే ఫలితాలు

IBPS..
ఏటా ఐబీపీఎస్‌ కూడా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగుల నియామకాలు చేపడుతుంది. ఇంటర్ అర్హతతో క్లర్క్‌ లెవల్‌ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్‌ చేపడుతోంది. బ్యాంకుల్లో ఉద్యోగాలు చేయాలనే కోరిక ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఈ రంగంలో అనుభవం పెరిగిన కొద్ది.. పొజిషన్ కూడా పెరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News