నాల్గో శ్వేత పత్రం రిలీజ్: వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై చంద్రబాబు వివరణ

ఏపీ సీఎం చంద్రబాబు తన పరిపాలనకు సంబంధించిన నాల్గో శ్వేత పత్రాన్ని విడుదల చేశారు

Last Updated : Dec 26, 2018, 12:26 PM IST
నాల్గో శ్వేత పత్రం రిలీజ్: వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై చంద్రబాబు వివరణ

ఏపీ సీఎం చంద్రబాబు తన పరిపాలనకు సంబంధించిన నాల్గో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సారి వ్యవసాయ అనుబంధ రంగంల్లో సాధించిన ప్రగతిపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లలో 82 వేల కోట్లు వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టామని ప్రకటించారు. ఈ క్రమంలో వ్యవసాయ,అనుంబంధ రంగాల్లో రెండంకెల అభివృద్ది సాధించామని వివరణ ఇచ్చారు. రైతల్లో ఆత్మవిశ్వాసం పెంచే విధంగా అన్ని విధాలుగా కృషి చేశామన్నారు. ప్రతి రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. మొత్తంగా రూ.24 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. దీంతో పాటు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నాలుగేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అయిందన్నారు. తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో రైతు ఆత్మహత్యలు గణణీయంగా తగ్గాయని చంద్రబాబు వివరణ ఇచ్చారు

సాగునీటి రంగంపై మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కృష్ణా డెల్టాకు సాగుకు సరిపడే నీరందించలేకపోయాయి. రాయలసీమ ప్రాంతంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. రాయదుర్గం వంటి ప్రాంతాలు ఎడాదిగా మారే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోతాము పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇటు డెల్టా ప్రాంతంతో పాటు రాయలసీమలో నీటి అవరసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. తమ ప్రయత్నంతో  డెల్టా ప్రాంతాన్ని సన్యాశ్యామలమైందని చంద్రబాబు వివరణ ఇచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసిన తాము..మరో 17 సాగు నీటి ప్రాజెక్టులను ప్రాంరంభించామని తెలిపారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా నదుల అనుసంధానం చేసి నీరు వృధాగా సుమద్రంలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టామన్నారు. భూసార పరీక్షల్లో నెంబర్ వన్ గా ఉన్నాం..హార్టికల్చర్ లో అనంతరపురం నెంబర్ గా ఉంది..కొడిగుట్ల ఉత్పత్తిలో మనం రెండో స్థానంలో ఉన్నామని చంద్రబాబు వివరణ ఇచ్చారు.

ముఖ్యాంశాలు:

* వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై శ్వేతపత్రం విడుదల
* నాలుగేళ్లలో 82 వేల కోట్లు వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టాం
* ఈ నాలుళేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రెండంకెల అభివద్ధి 
* రైతలు ఆత్మవిశ్వాసం పెంచే విధంగా కృషి 
*  రూ.1.50 లక్షల రుణమాఫీ చేశాం
* పట్టిసీమతో డెల్టా ప్రాంతాన్ని సన్యాశ్యామలం
* నాలుగేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు

Trending News