Chandrababu Strike: అరెస్టుకు నిరసనగా జైళ్లో చంద్రబాబు, డిల్లీలో లోకేశ్, రాజమండ్రిలో భువనేశ్వరి నిరాహార దీక్ష

Chandrababu Strike: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ వినూత్న నిరసన చేపట్టింది. గాంధీ జయంతి రోజున ఒక్కరోజు నిరాహార దీక్షకు సంకల్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 2, 2023, 07:01 AM IST
Chandrababu Strike: అరెస్టుకు నిరసనగా జైళ్లో చంద్రబాబు, డిల్లీలో లోకేశ్, రాజమండ్రిలో భువనేశ్వరి నిరాహార దీక్ష

Chandrababu Strike: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాళ గాంధీ జయంతి రోజున అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఒకరోజు నిరాహార దీక్షకు దిగుతున్నారు తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు, లోకేశ్ సహా ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొననున్నారు.

చంద్రబాబు అరెస్ట్‌ని నిరసిస్తూ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చంద్రబాబు కుటుంబం, తెలుగుదేశం నేతలు ఎక్కడికక్కడ ఒకరోజు నిరాహార దీక్షకు సంకల్పించారు. చంద్రబాబు జైళ్లోనే ఒకరోజు దీక్ష చేపట్టనుండగా, ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రి క్యాంప్ ఆఫీసులో దీక్షకు కూర్చుంటున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేశ్ అక్కడే ఎంపీ కనకమేడల ఇంట్లో నిరాహార దీక్షకు దిగుతున్నారు. 

ఇవాళ దీక్ష ప్రారంభించే ముందు ఉదయం 10 గంటలకు మీడియాతో సమావేశమై ఆ తరువాత దీక్ష ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ దీక్ష కొనసాగనుంది. చంద్రబాబు కుటుంబం దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అన్ని ప్రాంతాల్లో ఒక్కరోజు దీక్షకు దిగనున్నారు. 

మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపు అంటే అక్టోబర్ 3కు వాయిదా పడింది. జస్టిస్ బట్టి నాట్ బిఫోర్ మి అంశం లేవనెత్తడంతో కేసు విచారణ జస్టిస్ అనిరుధ్, జస్టిస్ త్రివేది బెంచ్‌కు వాయిదా పడింది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ అధికారులు నారా లోకేశ్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరవాలని సూచించారు.

Also read: Dussehra Holidays: ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు, ఎప్పట్నించంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News