విభజన హామీలపై మరోమారు కేంద్రాన్ని నిలదీసిన చంద్రబాబు

మోడీ సర్కార్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యాయి

Last Updated : Dec 26, 2018, 08:13 PM IST
విభజన హామీలపై మరోమారు కేంద్రాన్ని నిలదీసిన చంద్రబాబు

అమరావతి: విభజన హమీల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి కేంద్రం తీరు పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో  విభజన చట్టంలోని కేంద్ర హామీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు విభజన చట్టంలోని 14 హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని మోడీ సర్కార్ ధ్వజమెత్తారు. విద్యా సంస్థలకు ఏదో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు..ఈ విషయంలో కేంద్రం చేసింది అరకొర సాయమేనని ఎద్దేవ చేశారు. కనీసం రెవెన్యు లోటు తీర్చలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి ఆర్ధిక సాయం అందిస్తామని చెప్పి.. మట్టి, నీరు ఇచ్చి ప్రదాని మోడీ చేతులు దులుపుకున్నారని విమర్శించారు. విభజన హామీల అమలు కోసం  మొత్తం 90 వేల 283 కోట్ల కావాలని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.

శ్వేత పత్రంలోని ప్రస్తావించిన ముఖ్యాంశాలు:

* విభజన హామీల కోసం 29 సార్లు ఢిల్లీ వెళ్లినా దిక్కులేదు
*  హామీల అమలు కోసం మొత్తం 90 వేల 283 కోట్లు రావాలి
* బ్రిటీష్ పాలన కంటే దారుణ స్థితి.. పన్నుల భారం మోయలేని స్థితిలో ఉంది
* రాజధాని కోసం మట్టి నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు
* కేంద్రం సహకరించకపోయినా అమరావతి కోసం 40 వేల కోట్లు అప్పులు తెచ్చి మౌలిక వసతులు కల్పిచాం
* పేదలకు 3 వేల 500 ఇళ్లు కట్టించాం..రానున్న రోజుల్లో 50 వేల ఇళ్లు కట్టిస్తాం
* రెవెన్యూ లోటు 16 వేల కోట్లు ఉంటే 4 వేల కోట్లు మాత్రమే ఇస్తామన్నారు
* ఎన్డీయే నుంచి బయటికి వచ్చామనే కారణంతో  రెవెన్యూలోటులో రూ.138 కోట్లు కోత వేశారు
* రాజధానికి రూ. 39 వేల 937 కోట్ల డీపీఆర్ ఇస్తే 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు
* పోలవరం ప్రాజెక్టుకి 57 వేల 940 కోట్లకు డీపీఆర్ పంపించాం..ఆరు నెలలైనా ఒక్క పైసా ఇవ్వలేదు

* ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని చెప్పి కనీసం ఐదేళ్లు కూడా ఇచ్చేందుకు కేంద్రం ముందుకు రాలేదు
* కేంద్రం చేసిన మోసానికి నిరసనగా జనవరి 1న రాష్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు

Trending News