Chandrababu naidu: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం.. మూడడుగుల దూరంలో ఆగిన ట్రైన్.. వీడియో వైరల్..

Chandrababu naidu: చంద్రబాబు విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతంలో అలుపెరగకుండా పర్యటిస్తున్నారు. మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ  క్రమంలో  ఒక షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 5, 2024, 07:25 PM IST
  • ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పిన ప్రమాదం..
  • మూడు అడుగుల దూరంలో ఆగిన ట్రైన్..
Chandrababu naidu:  చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం.. మూడడుగుల దూరంలో ఆగిన ట్రైన్.. వీడియో వైరల్..

Chandrababu naidu escaped from train accident: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల్లో కన్నీళ్లను మిగిల్చాయి. ముఖ్యంగా.. తెలంగాణలోని  ఖమ్మం, ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ వరద ప్రభావానికి బాగా గురైంది. ప్రస్తుతం ఏపీ విషయానికి వస్తే.. విజయవాడలో.. వరదలు మాత్రం అక్కడి వాళ్లను అతలాకుతలం చేశాయి. సింగ్ నగర్ తో పాటు పలు ప్రాంతాలు వరద ప్రభావానికి బాగా దెబ్బతిన్నాయి. విజయవాడలో వరదలు ప్రజల్ని అతలాకుతలం చేశాయి.

 

సీఎం చంద్రబాబు.. రంగంలోకి దిగి మంత్రులు, అధికారుల్ని సైతం అప్రమత్తం చేశారు. అంతేకాకుండా.. అక్కడ వరద ప్రాంతాల్లోని బాధితుల్ని పరామర్శిస్తు.. తానున్నానని భరోసాను ఇచ్చారు. అంతేకాకుండా.. బోట్ లలో, జేసీబీలు, ట్రాక్టర్ లలో పర్యటిస్తు కూడా అక్కడి వారిని ఆదుకునే ప్రయత్నంచేశారు. ఈ నేపథ్యంలో.. విజయవాడలో పర్యటిస్తున్న చంద్రబాబు మరోసారి ప్రమాదం నుంచి బైటపడ్డారు. 

పూర్తి వివరాలు..

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.ఈ నేపథ్యంలో.. ఈరోజు మధురానగర్ వద్ద ఉన్న ప్రాంతంలో రైల్వే బ్రిడ్జీపైన ప్రయాణిస్తున్నారు. అప్పుడు ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో మధురానగర్ వదర ప్రాంతంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అదే సమయంలో ట్రాక్‌పై నుంచి ట్రైన్ వస్తోంది.

ఇది గమనించిన భద్రతా సిబ్బంది.. ట్రైన్ వస్తుందనిన, అక్కడి నుంచి వెళ్దామని చెప్పారు. మరోవైపు విషయాన్ని గమనించిన అక్కడి టీడీపీ కార్యకర్తలు.. లైన్‌మెన్‌ను అలర్ట్ చేశారు. అతను ట్రైన్‌కు ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ స్లో అయ్యింది. అప్పటికే చంద్రబాబు ఒకవైపు జాగ్రత్తగా ఉండిపోయారు. చంద్రబాబు భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ సెఫ్టీ వాల్ గా నిలబడ్డారు.

Read more: Ola auto driver: రెచ్చిపోయిన ఓలా డ్రైవర్.. రైడ్ క్యాన్షిల్ చేసిందని యువతిని కొట్టి.. షాకింగ్ వీడియో వైరల్..  

ట్రైన్ సరిగ్గా మూడు అడుగుల దూరంలో ఆగిపోయింది. దీంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా తమ అభిమాన నేతకు ఏమైందా అని..  ఆరా తీస్తున్నారు. మరోవైపు.. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం.. సీఎం చంద్రబాబుకు ఏమైందో అంటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News