Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే

Chandrababu Case: ఏపీ స్కిల్ స్కాంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఉపశమనం లభిస్తుందని ఆశలు పెట్టుకున్న చంద్రబాబుకు చుక్కెదురైంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా పిటీషన్ మాత్రం కొట్టివేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 16, 2024, 03:09 PM IST
Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే

Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటీషన్‌పై మూడు నెలల తరువాత సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. సెక్షన్ 17ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తుల్లో అస్పష్టత ఉన్నా...క్వాష్ పిటీషన్ మాత్రం కొట్టివేశారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ సక్రమమేనని ఇద్దరు న్యాయమూర్తులు తెల్చి చెప్పారు. 

చంద్రబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైందని చెప్పవచ్చు. ఏపీ స్కిల్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని అందుకే ఈ అరెస్టు అక్రమమని వాదిస్తూ క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను తొలుత ఏసీబీ కోర్టు, తరువాత ఏపీ హైకోర్టు కొట్టివేశాయి. ఆ తరువాత సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టులో సవాలు చేశారు చంద్రబాబు. దీనిపై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. అక్టోబర్ 17న తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ వెలువడిన తీర్పులో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేశారు. కానీ ట్రయల్ కోర్టుకు రిమాండ్ అధికారం ఉంటుందని, అరెస్ట్ అక్రమమని చెప్పలేమని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. క్వాష్ పిటీషన్ కొట్టివేస్తూ..కేసును సుప్రీంకోర్టు సీజేఐ బెంచ్‌కు రిఫర్ చేశారు. 

జస్టిస్ అనిరుద్ధ బోస్ ఏమన్నారంటే...

ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17 ఏ వర్తిస్తుంది. కేసు విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవల్సింది. గతంలో జరిగిన దర్యాప్తుకు ఈ అరెస్ట్ ను వర్తింపజేయకూడదు. చంద్రబాబు కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (1)(మ), 13 (1)(డి), 13(2) వర్తించవు. అయితే చంద్రబాబుకు ట్రయల్ కోర్టు విధించిన రిమాండ్ ఆర్డర్ కొట్టివేయలేం.  అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ అక్రమం కాదు. రిమాండ్ చెల్లుతుంది, కొనసాగుతుంది. 

జస్టిస్ బేలా ఎం త్రివేది ఏమన్నారంటే

ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా కేసు క్వాష్ చేయలేం. పాత కేసులకు సెక్షన్ 17ఏ వర్తించదు. సవరణ వచ్చిన తరువాత కేసులకు మాత్రమే సెక్షన్ వర్తిస్తుంది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులకు సెక్షన్ 17ఏతో ముడిపెట్టి ఊరట ఇవ్వడం తగదు. సెక్షన్ 17ఏ అవినీతికి రక్షణగా ఉండకూడదు. గవర్నర్ అనుమతి లేనంతమత్రాన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయలేం. ఈ తరహా కేసులో సెక్షన్ 17ఏ వర్తింపజేస్తే అన్ని కేసులకు ఇదే వర్తిస్తుందనే వాదన ప్రారంభమై..న్యాయ ప్రక్రియ అపహాస్యం అవుతుంది. 

అంటే ఈ ఈ కేసులో మొత్తం ఓసారి పరిశీలిస్తే చంద్రబాబుకు చుక్కెదురైందనే చెప్పాలి. సుప్రీంకోర్టులో ఆశించిన ఊరట లభించలేదు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌ను ఇద్దరూ కొట్టివేశారు. 

Also read: Shahi Eedgah Masjid Issue: షాహీ ఈద్గా మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News