Chandrababu Case: స్కిల్ కేసులో రిమాండ్ ఖైదీగా 47 రోజుల్నించి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కేసుల్నించి ఎలా బయటపడాలో అర్ధం కావడం లేదు. బెయిల్ ఇప్పట్లో వచ్చేలా లేదని తెలుస్తుండటంతో ఇప్పుడు మరో అనారోగ్య కారణాన్ని వెతికిపట్టుకున్నారు చంద్రబాబు న్యాయవాదులు.
45 ఏళ్లుగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ కోర్టు మెట్లెక్కకుండా సఫలీకృతులయ్యారనేది టీడీపీ అధినేత చంద్రబాబ గురించి చెప్పే వ్యాఖ్యలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతా ప్రతికూల పరిస్థితులు ఎదురౌతున్నాయి. ఏపీ స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు నుంచి ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఎక్కడా ఉపశమనం లభించడం లేదు. ఇప్పటికే 47 రోజులుగా జైలులో ఉన్నారు. సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న సెక్షన్ 17ఏ సంబంధిత క్వాష్ పిటీషన్‌పై తీర్పు నవంబర్ 8న వెలువడనుంది. అప్పటి వరకూ బెయిల్ కూడా వాయిదా పడుతోంది.
ఎలా ప్రయత్నించినా బెయిల్ లభించకపోవడంతో ఇప్పుడు న్యాయవాదులు సరికొత్త కారణాన్ని వెతికి తీశారు. మూడు నెలల క్రితం చంద్రబాబుకు ఎడమ కంంటికి సంబంధించి కేటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, ఇప్పుడు కుడి కంటికి చేయించాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా ఈ పిటీషన్‌పై విచారణ చేయాలని కోరారు. అయితే ఇంకా కోర్టు ఈ పిటీషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ పెండింగులో ఉంది. రేపు రెగ్యులర్ బెయిల్ పిటీషన్‌పై విచారణ జరగనుంది. చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ ఉన్నందున వ్యక్తిగత వైద్యునితో చికిత్స కోసం బెయిల్ మంజూరు చేయాలని మరో పిటీషన్ దాఖలు చేశారు. మొత్తానికి అనారోగ్యాన్ని కారణంగా చూపిస్తూ చంద్రబాబుకు బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
మరోవైపు అంగళ్లు కేసు, అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్ కేసు, ఏపీ ఫైబర్‌నెట్ కేసు చంద్రబాబుని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఏపీ ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను సుప్రీంకోర్టు అక్టోబర్ 29న విచారించనుంది.
Also read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Chandrababu Case: బెయిల్ కోసం మరో ప్రయత్నం, కేటరాక్ట్ చేయాలంటూ చంద్రబాబు పిటీషన్