Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటీషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ ముగిసింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేయగా అటు ఏపీ హైకోర్టు లోకేశ్‌ను 12వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దంటూ ఊరటనిచ్చింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. మరోవైపు చంద్రబాబును కస్డడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటీషన్‌పై సైతం ఇవాళ విచారణ సాగింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు విన్పించగా, సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. స్కిల్ కేసులో చంద్రబాబు తప్పేమీ లేదని, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదించారు. ఇప్పటికే రెండ్రోజులు కస్టడీ తీసుకున్నందున మరోసారి కస్డడీ ఎందుకని అభ్యంతరం తెలిపారు. మరోవైపు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సరికాదని, సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశముందని పొన్నవోలు కోర్టుకు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న చంద్రబాబు పీఏ శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకు పారిపోవడం వెనుక చంద్రబాబు హస్తముందని వాదించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఏసీబీ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
మరోవైపు ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం నారా లోకేశ్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తొలుత ఇవాళ్టి వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు ఆ ఆదేశాలను 12వ తేదీ వరకూ పొడిగించింది. అప్పటివరకూ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.
Also read: Nandamuri vs Nara: బాలయ్య ఏమయ్యారు, ఓదార్పు యాత్ర భువనేశ్వరి చేపట్టడానికి కారణమదేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook